చివరి చూపు

చివరి చూపు

అలజడి చేసిన ఆతృత
నింపిన క్షణం
ఆ క్షణం కనుమరుగు అయితే మిగలదు
మనిషి చివరి యాతన
చెరగని ముద్ర వేసిన చేదు
నిజం అది
మాలిన్యం లేని మామకారపు చూపు అది
మరపురాని అనుభవం
మది నిండిన భాధ అది
చెదరిన కలల స్వేదం
మరు జన్మకు మార్గమది
సృష్టించిన చలనము
జీవాత్మ కు శరణమూ చివరిచూపు అది అవుతుంది మదిలోన
గునపము విది విధించిన
గడువు మంత్రము అదియే
చివరి చూపు.
– జి.జయ

Related Posts