క్రిస్టమస్

క్రిస్టమస్

నకిలీపురం నుండి నా చెల్లెలు “నీ కూతురిని చూడాలనిపించింది తీసుకునిరా అన్నయ్యా అని కబురుపెడితే”. నేను, నా ముద్దుల కూతురు ఇద్దరము వెళ్ళాము. బస్టాండు నుండి ఒక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళింటికి. పాపని భుజాలమీద ఎక్కించుకొని బయలుదేరాను. వీది నిండా లైట్లు, భక్తి పాటలు, ప్రార్థనలతో హోరెత్తుతోంది.

పాప ఆ పండుగను చూసి ఎంతో ఆతృతగా ప్రశ్నలు అడుగుతోంది. ఎండ ఎక్కువుగా ఉండటం వల్ల నేను ఏమీ చెప్పలేక పోయా. అక్కడున్న ఐస్క్రీమ్, బాంబే మిఠాయి తింటూ శాంటాక్లాస్, క్రిస్మస్ ట్రీ, మొదలగువాటిని ఆస్వాదిస్తూ నిద్రపోయింది.

ఇంటికి వచ్చి అందర్నీ పలకరించి, చుట్టాలు ఇంటికి పోయివచ్చినా గానీ పాప ఇంకా లేవలేదు. టైమ్ 5 గంటలయింది పాపని నిద్ర లేపి స్నానం చేయించి, వంటా వార్పు కార్యక్రమాలు చేసేటప్పటికి 7:30 నిమిషాలయింది మా చెల్లికి. ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేసి ఆరుబయట నులక మంచ మేసుకొనో నేను, పాప ఇద్దరం అలా కూర్చొన్న తర్వాత పాప తన మనసులో ఉన్న ప్రశ్నలను సందిస్తూ ఉంది.

నాన్న ఏమి పండుగ వాళ్ళు చేసుకొనేది? మన ఊరిలో ఎందుకు చెయ్యరు? ఏ దేవుడికి పూజ చేస్తారు? ఎర్రగుడ్డలేసుకొన్న అతను ఎవరు నాన్న? అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే వుంది. అది కిస్మస్ పండుగ, ఆ పండుగను క్రైస్తవులు జరుపుకుంటారు. ప్రార్థనలు చేసే చోటుని చర్చి అంటారు. ఈరోజు ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్టమస్ గా జరుపుకుంటారు.

అతను పెళ్ళికాని ఒక కన్యకు దేవుని వరముచే, ఇల్లు లేని వారికి ఒక పశువుల పాకలో జన్మిస్తాడు. ఏసుక్రీస్తు ని పెంచడానికి తల్లి చాలా ఇబ్బందులు పడుతుంది. తల్లిని, బిడ్డని కూడా రాజులు చిత్రహింసలకు గురిచేస్తారు. అయినా ప్రభువు పెరిగి పెద్దవాడై ప్రజల రక్షణకై పోరాడుతూ, ప్రజలను పాపాల నుండి రక్షించుటకు తన రక్తాన్ని చిందిస్తాడు.

అయినా రాజకుమారులు ఏసును నిందలకు, అవమానాలకు గురిచేస్తూ, శిలపై కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టి చంపేస్తారు. అయినా ప్రభువు బయపడడు. తన విశ్వాసులకు రక్షించుటకై మరలా జన్మిస్తానని మాటిస్తాడు.

నువ్వు చూసిన శాంతాక్లాస్ పిల్లలకు బహుమతులు ఇస్తుంటాడు, పిల్లలు తమకు కావాల్సిన దాని గురించి రాసి అతనికి పోస్ట్ చేస్తే కచ్చితంగా తీరుస్తాడుని నమ్ముతారు. మరి మనం ఎప్పుడూ చర్చికి వెళ్ళలేదు కద నాన్న నేను కూడా వెళ్ళలేదు కానీ అమ్మ, పిన్ని పొయ్యేవారు. అయితే నాన్న ఈసారి మనం కూడా వెళదాము.

అవును అన్నయ్యా నాకు వెళ్ళాలని ఉంది నన్ను, పాపని, ఇంట్లోని వాళ్లందరినీ తీసుకెళ్లండి అన్నయ్యా. సరే అమ్మా పొద్దున్నే అందరము వెళదాము. మరుసటి రోజు ఉదయాన్నే అందరం వెళ్లి ప్రార్థనలను విని వచ్చాము

– హనుమంత

సేకరణ

 

Related Posts