చుక్క

చుక్క

దివి లోన తారవి నీవు.
భువి పైన తారను నేను.
నీవు ఆకాశ బుగ్గన చుక్క వైతివి.
నేను భూదేవి బుగ్గన ఐతిని.
నీవు వెలిగే చుక్క వే.
నేను ఉరుమై మెరిసే చుక్కనే.
వేల తారల్లో నొక్కరిమే.
మరుగునపడి తే
కనుగొనుట కష్టమే!

వైభవము నందు

వేనోళ్ల కొనియాడ బడితిమి

మెరుపు చాటున నీ
తళ్ళుక్కు వెలసి పోవు.
మెరుపు తగ్గితే నన్ను
ఎదురాయె చుక్క అని ఎంచు.
ఇది సితార.
గగన తార అవుట గగనమే!

– వాసు

Related Posts