"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

సినారె ,మళ్లీ పుట్టాలి సినారె

సినారె ,మళ్లీ పుట్టాలి సినారె

సినారె పుట్టినూరు
హన్మాజీ పేట అల్లాడిపోతోంది
సినారె చదువుకున్న ఊరు
సిరిసిల్లా చిన్నబోతోంది
మాకు పేరుతెచ్చిన’కవి,బాపూ’ ఇకలేడని..

తెలుగు అక్షరాలు తల్లడిల్లు తున్నాయి
ప్రతి పుట్టినరోజున కొత్త పుస్తకానికి జన్మనిచ్చే
మా ” కవి బ్రహ్మ ” ఇకలేడని..

తెలుగుభాష దీనంగా దిక్కులు చూస్తోంది
తన’ కలం గళం ‘ తో ఘన కీర్తి తెచ్చిన
మా “మధుర కవి ” ఇకలేడని..

తెలుగు చలనచిత్ర కళామతల్లి
కలత చెందుచున్నది
‘ఇగిరిపోని గంధమంటి’ పాటలు అందించిన
పదాలకు పరిమళం అద్దిన
మా ” కవి సినారె ” ఇకలేడని..

సినారె సినీ గీతాభిమానుల హృదయం
ఇప్పుడు పాడుతోంది విషాద గీతం
సినీ గీతాలతో ‘పగలే వెన్నెల ‘కురిపించి
పద సౌందర్యంతో పాటకు ‘నిన్నలేని అందమేదో తెచ్చిన’
మా “అభిమాన కవి ” ఇకలేడని..

వర్ధమాన కవులు దిగులు చెందుచున్నారు
అడిగినంతనే’ కవితా సంపుటాలకు ‘ముందు మాటరాసిన
మా ” ఆత్మీయ కవి ” ఇకలేడని..

ఆ పెదవి మెదిపితే ఆణిముత్తెపు జల్లు
ఆ కలం కదిపితే అందాల హరివిల్లు
ఆయన కలం “బంగారు కడ్డీ”
ఆయన పేరు “నారాయణరెడ్డి”..

 

-గురువర్ధన్ రెడ్డి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *