సినిమా ఒక్కటే మనుషులు వేరు

సినిమా ఒక్కటే మనుషులు వేరు

నిద్ర రాక కొందరు సెకండ్ షో తో..
నిద్ర మానుకొని మరికొందరు అన్ని షోలతో..

అతి జాగత్ర తో అరగంట ముందు..
అతి నిర్లక్ష్యం తో పావు గంట తర్వాత.. ప్రవేశం..!

శుభం కార్డు పడేదాకా కొందరు..
సగం మధ్యలో వెళ్ళేవాళ్ళు ఇంకొందరు..!

గుట్కా, పాన్ పరాక్ ల బ్యాచ్..
పాప్ కాన్, కూల్డ్రింక్ ల తిండి బోతులు బ్యాచ్..!

ఏమి జరిగినా కదలని బుద్ధ గ్రహాలు..అంకితం సీట్ కి..,
అస్సలు కదలకుండా ఉండలేని చేప పిల్లలు…!
విజిల్స్,పేపర్ కటింగ్, అరుపులు.. అదుపు ఉండదు వీళ్ళ ఆనందనికి….!

నెల టికెట్ తో బాల్కనీ లోకి…
గోడ దూకి సగం సినిమా దొంగచాటుగా …
ఒకటి టికెట్ పై రెండు సీట్స్..!,
అడిగితే మా ఒళ్ళో ఉంటారు అనే సమాధానం…
సైకిల్ స్టాండ్ అన్న మా బంధువు అని కొందరు…

కరెంట్ పోయి బొమ్మ ఆగే..,
హలోడి అమ్మ, నాన్న లను గుర్తు చేసే తిట్ల పొరగాళ్ళు ఎందరో….
ముందు సీట్స్ పై కాలు పెట్టేవారు..,
లేడీస్ నీ కామెంట్ చేసేవారు ఇంకా ఉన్నారు..!

వరుస చివరి సీట్స్ ..,
ప్రేమ పావురాలు వదలరు …!
ఫ్యామిలీ వాళ్ళు వరస మధ్య సీట్స్ వదలరు…!
ప్రాజెక్టర్ కు అడ్డం గా…,
తెర పై వారి బొమ్మ కోసం యవకులు…!

మొదటి రోజు మొదటి ఆటతో నిద్రపోయేవారున్నారు..
రోజు నాలుగు ఆటలు చూసి నిద్ర పట్టనివాళ్ళు ఉన్నారు…
హాల్ లో మొబైల్ తో కాపురం చేసే వాళ్ళు..
పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందేవారు ఉన్నారు…

ఎ సి తగ్గిందని..
సీట్స్ కంఫర్టబుల్గా లేవని
తెర మీద బల్లి అడ్డం వచ్చిందని…
మోచేయికి స్థలం లేదని…
కార్ పార్కింగ్ రేట్స్ పెరుగాయని..
గేట్ మెన్ గౌరవం ఇవ్వలేదని….
ఇలా “విసుగు” వారేందరో…!!!

బోర్ కొట్టి..
కాలక్షేపం కోసం…
మొహమాటంతోనో..
ఒంటరిగానో..
స్నేహితులు నడుమో…
ఫ్యామిలీ మధ్యలోనో.
మూవీ లో 24 ఫ్రేమ్స్ ఎంజాయ్ చేసేవారు ఎందరో…

 

– టింకు.ఎస్

 

Related Posts