సినిమా

సినిమా

 

సినిమా అంటే ఒక జీవితం , సినిమా ఒక ప్రపంచం,సినిమా ఒక కుటుంబం, సినిమా ఎందరి జీవితాలని మార్చే ఒక గొప్ప విషయం,.

సినిమా అంటే సినిమానే , ఎందరికో కల, వారి లక్ష్యాలను సాధించడానికి ఎంచుకునే మార్గం, వారి జీవితాలను కుటుంబాలను వదిలేసి కేవలం సినిమా కోసమే బ్రతికే వారెందరో ఉన్నారు.

ఎందరికో ఉపాధి చూపించేది సినిమా ఇంకా సినిమా గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ఆశయం కథ చదవండి.మనిషి జీవితాలని ప్రతిభింబించేదే సినిమా,

సినిమా కోసం కొన్ని వేల కథలు రాసుకుని తిని తినక పస్తులు ఉంటూ రోడ్లు పట్టుకునే ప్రతి ఆఫీస్ కి తిరిగే ఒక వ్యక్తి .ఎప్పటికైనా సినిమా తీయాలని,కనిపించాలని కోరుకునే వారెందరో కృష్ణానగర్ రోడ్డు పై తిరుగుతూ ఉంటారు.

వారి కలలు తీరాలని కోరుకునే కుటుంబం ఓ వైపు తమ బిడ్డ తిన్నాడో లేదో అని వారు పస్తులు ఉంటూ పిల్లలకు డబ్బు పంపే వారు కొందరు అయితే మరికొందరు ఇంట్లోంచి తరిమెస్తే రోడ్ల పై తిరుగుతూ స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కే గడప, దిగే గడప.

ఆశలు, కోరికలు అన్ని తీర్చుకునే రోజులు తప్పక వస్తాయని ,రాకపోతే చనిపోయే వారెందరో ఉన్నారు. సినిమా లోకం అంటే అదో మాయ ప్రపంచం. అక్కడ కూడా కుల రాజకీయాలు ఎక్కువగానే కనిపిస్తాయి.

మొన్నటికి మొన్న ఇల్లంతా స్క్రిప్ట్ లే ఉన్న అన్న అనుమానాస్పదంగా చనిపోయి కనిపించడం హృదయ విదారకంగా అనిపించింది.

పెద్ద పెద్ద హీరో హీరోయిన్ లు చివరి దశ లో అన్ని కోల్పోయి అనాధలుగా చావడం చూస్తూనే ఉన్నాం.అదే మాయ అక్కడ అదృష్టం ఉంటేనే నాలుగు రోజులు ఉంటారు.

లేదంటే మట్టి కొట్టుకు పోతారు…. ఇంకా చాలా ఉంది కానీ కొంచెమే వివరించాను. ..

 

-భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *