సిటీలోఅంతే
సిటీలో అంతా ఎవరకు వారే యమునా తీరే. మస్తు బిజీగా
ఉంటారు. బిజీగా లేకపోయినా
ఉన్నట్లు నటిస్తారు. అలాంటి
వాడే రాకేష్ భాయ్. ఉదయం
చాయ్ తాగిన దగ్గరనుండి రాత్రి
పడుకునేవరకు బిజీ-బిజీగా
ఉంటాడు. ఏ పనైనా చేసిపెట్టేస్తానని అందరికీ చెపుతూ ఉంటాడు. అసలు
తనకి అందరు మంత్రులు
తెలుసని చెపుతూ ఉంటాడు.
ఉద్యోగం కావాలన్నా, లోన్
కావాలన్నా చిటికెలో ఇప్పిచ్చేస్తాను అని చెపుతూ ఉంటాడు. నమ్మినవాళ్ళ
దగ్గర డబ్బులు వసూలు చేస్తూ
ఉంటాడు. డబ్బులు వసూలు
చేసాక ముఖం చాటేస్తాడు. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా కనపడి ఆపి డబ్బులు అడిగితే
రుబాబు చేస్తాడు. ఇలా మూడు పువ్వులు ఆరు
కాయలుగా సాగుతోంది
అతని దందా. ఎల్లకాలం
జనాల్ని మోసం చేయలేమనే
విషయం అతనికి అర్ధం అయ్యింది. జనాలు తనను తన్నే దాకా పరిస్థితి తీసుకుని
రాకూడదు అని అర్థం చేసుకున్నాడు. అంతే
సిటీలోని మరో ఏరియాకు
వెళ్ళి స్ధిరపడ్డాడు. బాధిత జనాలు అతని కోసం వెతికి చివరకు కొన్నాళ్ళకు అతని గురించి మర్చిపోయారు.
కొత్తగా వెళ్ళిన చోట
రియల్ ఎస్టేట్ బ్రోకరుగా
దందా మొదలుపెట్టాడు.
చవకగా ఇల్లు ఇప్పిస్తానని
అందర్నీ నమ్మించాడు.
నమ్మినవాళ్ళ దగ్గర
డబ్బులు తీసుకుని చక్కగా
అక్కడ నుంచి ఉడాయించాడు. ఇలాంటి
రాకేష్ లు చాలా మంది సిటీలో తిరుగుతూ అమాయక ప్రజలకు టోపీ పెట్టి మాయం అవుతారు. తస్మాత్ జాగ్రత్త రీడర్సూ. నేను కూడా ఇలాంటి
వారి మాట విని నష్టపోయాను.
-వెంకట భానుప్రసాద్ చలసాని