దారి

దారి

అందుకోలేని ఆకాశంలా
ఆనందం ఊరిస్తుంటుంది
ఆలోచనల వంతెనపై
మనసు పచార్లు చేస్తుంటుంది

దరిచేరిన తాయిలాలేవీ
కోరికల దాహం తీర్చలేక
చతికిలబడుతుంటాయి
దారి మూసుకుపోతుంది

ఆశకు ప్రాణంపోసి
చీకటిలో నడుస్తుంటావు
కీచురాళ్ళ ధ్వనుల సంగీతంతో
మేల్కొన్న మనసు దారి కనుగొంటుంది

– సి.యస్.రాంబాబు

Related Posts