డబ్బు – ప్రేమ

డబ్బు - ప్రేమ

డబ్బు – ప్రేమ

ఎవరో చేసిన పాపానికో.. వారి క్షణ కాల కోరికకు బలి అయ్యి.. అనాధగా మారిన బాలుడు. చెత్తకుప్పలో పడిన పసికందు.. ఎవరి పాపమో.. ఎవరి శాపమో..వీడికి శిక్ష.. అనాధగా పెరిగే పరిస్థితి.. చెరదీసింది ఓ ఆశ్రమం.. ఒడిన చేర్చుకుంది.. తల్లి,తండ్రి, గురువు అన్ని తానై నిలిచింది.. దేవుడు తల్లితండ్రులను దూరం చేసిన ఆ అబ్బాయికి ఈ ఆశ్రమం ఒడి చేర్చి కాస్త మేలు చేశాడు.. నారు పోసిన వాడు నీరు పోయడా అన్నట్టు.. రాత రాసిన వాడే గా దారి చూపేది.. అలా చూపాడు..

అయినా ఆ అబ్బాయికి ఇక అంతా మంచి చెడు అన్ని ఆ ఆశ్రమం అయి పెంచింది.. అక్కడే ఉంటూ చక్కగా చదువుకుంటూ.. గొప్ప స్థాయికి ఎదిగాడు..తనకంటూ సమాజంలో ఓ స్థాయి ఓ పేరు సంపాదించుకున్నాడు.. చిన్న వయసులోనే అన్ని విధాలుగా ఒక బ్రాండ్ లా తనని నిరూపించుకున్నాడు… అలా తను సొంతంగా నిర్మించుకున్న తన ఆఫీస్ లోకి ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కి వచ్చింది.. తన ప్రతిభతో నెగ్గింది.. తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా చేరింది..

అమ్మాయి బాగుంటుంది.. కట్టు బొట్టు కుందనపు బొమ్మలా.. తను చలాకీగా పని చేసేది… తన పని తను ఈ అబ్బాయిని బాగా కదిలించాయి… తను ఆ అమ్మాయి ప్రేమ లో పడ్డాడు.. కొద్ది రోజులు గడిచాయి ఆ అబ్బాయి నేరుగా వెళ్లి అమ్మాయికి ప్రేమిస్తున్న అని చెప్తాడు.. ఆ అమ్మాయి సమయం కావాలి అంటుంది.. (ఆ అమ్మాయి మనసులో గురుడు బాగానే వలలో పడ్డాడు.. ఎలాగైనా ఆస్తి లాగేయలి అనుకుంటుంది.)

రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ ఆ అబ్బాయి నేను చెప్పిన విషయం ఎం చేశావు అని అడుగుతాడు.. అప్పుడు ఆ అమ్మాయి సరే అన్నట్టు తల ఊపుతుంది.. ఆ అబ్బాయి సంతోషానికి అవధులు లేవు.. ఇన్నాళ్ళ నా ఒంటరి జీవితంలోకి ఓ తోడు నువ్వు వచ్చావు.. పుట్టుక నుండి అమ్మ నాన్న ప్రేమకు నోచుకోని నేను.. నీలోనే మా అమ్మను చూసుకుంటా.. నిన్ను మా అమ్మలా కంటికి రెప్పలా చూసుకుంటా అని ఆ అమ్మాయికి మాటిస్తాడు…

ఆ అమ్మాయి నన్ను ఇంత ప్రేమించే నీకు తిరిగి ఏమివ్వగలను మీ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో నాకు తెలీదు.. కానీ నేను మీ అమ్మలా కాకున్నా అమ్మ ప్రేమను పంచుతా అంటుంది… అలా ఇద్దరి ప్రేమ కొన్నాళ్ళు నడుస్తుంది.. ఆ అబ్బాయి, ఆ అమ్మాయి వరంలా దొరికింది నాకు అని మురిసి పోతాడు.. ఇక్కడ ఈ లోపు ఈ అమ్మాయి మాయతో ఆస్తులు తన సొంతం చేసుకుంటుంది.. సమయం చూసుకొని పారిపోతుంది…

ఆ అబ్బాయికి ఏమి అర్దం కాదు.. ఎటు పోయిందో ఈ అమ్మాయి తెలీదు.. ఎందుకు పోయిందో తెలీదు.. ఆ అమ్మాయికి పూర్తిగా బానిస అయిపోయాడు.. తనని చూడకుండా ఉండలేని పరిస్థితి.. అలాంటి పరిస్థితిలో మళ్లీ ఒంటరి వాడు అయ్యాడు.. ఈసారి అనాధగా మాత్రమే కాదు బతికున్న శవంలా మారాడు… అలా కొన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి మీద పిచ్చి ప్రేమతో వెతికాడు.. దొరకలేదు ఈ అబ్బాయికి ప్రేమ తగ్గలేదు… ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు.. పుట్టగానే తల్లి తండ్రులకు దూరం చేసి దేవుడు మోసం చేశాడు.. ఒక స్థాయికి వచ్చాక అమ్మాయి ప్రేమలో పడి సర్వం తానే అనుకుని సర్వస్వం అర్పించి ఈ అబ్బాయి మోసపోయాడు..

నేను ఒకటే చెప్పదలచుకున్నాను.. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలా ఆస్తుల కోసం ప్రేమించి మోసం చేయకండి. మీకు అది డబ్బు సంపాదించే ఒక గేమ్ లా అయి ఉండొచ్చు కానీ అవతలి వారికి అది ప్రేమలో ప్రాణాలతో చెలగాటం లాంటిది. ఒక వేళ మీకు డబ్బే ముఖ్యం అయితే ఎలాగో ప్రేమించారు కాబట్టి అది నటన కాకుండా మీరు కూడా నిజంగా ప్రేమిస్తే ఇద్దరు అదే డబ్బుతో సంతోషంగా ఉండేవారు కదా.. ఇక్కడ వీడి దగ్గర మోసం చేసి దోచుకున్న డబ్బు రేపటి రోజు నువ్వు ఇంకొకరి చేతిలో మోసపోయి పోగొట్టుకోవల్సిందే…. అదేదో ఇక్కడే నిజాయితీగా ఉంటే ప్రేమలో ఇద్దరు నువ్వు కోరుకున్న డబ్బుతోనే సంతోషంగా జీవించే వారు…. అనవసరంగా ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వారు అవుతున్నారు.

డబ్బు చేతులు మారొచ్చు కానీ.. ప్రేమ మనసులు మారదు…

– వనీత రెడ్డీ

ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా... Previous post ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా…
యోధ ఎపిసోడ్ 11 Next post యోధ ఎపిసోడ్ 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *