దైవం

దైవం

కడుపున పడినప్పటి నుంచి,
తన కట్టె కాలేవరకూ  కన్నపిల్లలను
కంటికి రెప్పలా, కష్టం లేకుండా కాపాడుకోవాలనుకుంటుంది.
నీతి, నిజాయితీతో జీవించాలని,
క్రమశిక్షణ, కర్తవ్యాలను బోధిస్తుంది.
ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు తెలియజేస్తూ
పిన్న వయసు నుంచి పెద్ద వాళ్ళుగా పెంచే క్రమంలో తను ఎంత కష్ట పడినా, ఎన్ని అడ్డంకులు అధిగమించైనా,
ఒంటరిగానైనా, ఇంటి భారాన్ని, బాధ్యతను నిర్వహిస్తుంది
కట్టుకున్న వాడిని సైతం కన్న పిల్లలకోసం ఎదురిస్తుంది.
ఎవ్వరూ నమ్మకపోయినా, కన్నతల్లి మాత్రం పిల్లల మీద నమ్మకం ఉంచుతుంది. వారి అలోచనలకు, అభిప్రాయాలకు గౌరవిస్తుంది.
తన పిల్లల్ని ఉక్కు మనుషుల్లా, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే మనసున్న మనిషిగా పెంచుతుంది
సహనంలో ధరిత్రి , భువిలోని దేవతామూర్తి కన్నతల్లే.
తల్లిని మించిన దైవం లేదు.
– బి. రాధిక

Related Posts