దందా

దందా

దందా

ఏమో పొద్దున్నే రెండు రాసిన ఎలా ఉన్నాయో చెప్పండి. వర్షం పడుతూనే ఉంది ఆగడం లేదు.ఇంట్లో కూరగాయలు లేవు పొద్దున్నే అరిచి లేపే ఉల్లిగడ్డల పిలుపులు లేవు , రయ్యి రాయ్యి మంటూ మబ్బున నుంచి తిరిగే బండ్ల సప్పుల్లు లేవు,

చల్లగా ఉన్న వాతావరణం దుప్పటి ముసుగు తియనివ్వడం లేదు. సమయం ఎంతైనా వెచ్చగా పడుకోవాలని ఉంది. కానీ. మనకు ఇలా ఉంటే పళ్ళు, పువ్వులు, రోజూ దందా చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి పాపం.

వాళ్ళు దందా చేస్తే గాని కడుపు నిండని బతుకులు ఓ వైపువాతావరణం చల్లగా ఉంది ఏం బజ్జీలు వేసుకుందాం అంటూ కోరికల గుర్రాలు ఓ వైపు అడుగడుగునా అంతరాయాలు ఓ వైపు , ఉద్యోగానికి పోతే ఒక బాధ, పోక పోతే ఒక బాధ, రెండేళ్ల నాడు హైద్రాబాద్ అంతా వానాలతో తలకిందులు అయ్యింది.

పడవలు వేసుకొని తిరిగారు. వాడేదో సినిమాలో అన్నట్టు హైదరాబాదుకు సముద్రాన్ని రప్పిస్తా అన్నట్టు, నిజంగానే రెండేళ్ల క్రితం పడవలు వేసుకుని తిరిగారు.అప్పటి జనం కష్టాలు ఇంకా కనుమరుగు కాకముందే ఇప్పుడీ వానలు …

ఇక చాలు వరుణ దేవా , అలసి పోయావు ,ఇక వెళ్ళిపో అంటూ పూజలు చేయాలా ,నిన్ను బతిమాలి పంపాలా … చాలు ఇక చాలు వెళ్ళిపో ,వెళ్ళిపో , తాగడానికి నీళ్లు లేక తల్లడిల్లి పోతున్నాం, బయటకు వెళ్తే ఏ మ్యాన్ హోల్ మా ప్రాణాలు తీస్తుందో అని. భయపడి చస్తున్నాం.,

బట్టలు అరక ఫ్యాన్ కింద అరబెట్టక ముక్క వాసన ఇల్లంతా నిండిపోయి ముక్కులు బిగా పట్టుకుని కూర్చున్నాం , ఇక చాలు వరుణ దేవా ఆగిపోయి ,వెళ్ళిపో, మా బట్టలు అరెలా, మా కష్టాలు తీరేలా , వెళ్ళు వరుణ దేవా…

-భవ్యచారు

కమ్ముకున్న మేఘాలు Previous post కమ్ముకున్న మేఘాలు
తప్పు నాదా మీదా Next post తప్పు నాదా మీదా

One thought on “దందా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close