దానిని అధిగమించటం ఎలా?!
ఇది శారీరకంగా గానీ,మానసికంగా కానీ వత్తిడికి గురై నపుడు ఈ డిప్రషన్స్ వస్తాయి.ఇది రోగం కాకపోయినా మనిషిని కుంగదీస్తుంది.ఈ డిప్రెషన్ వలన అనేక రోగాలు వస్తాయి.
బీ పీ,షుగర్,హృద్రోగాలు ఇవన్నీ ఆ డిప్రెషన్ వల్లే వస్తాయి .ఇప్పుడు ఈ వత్తిడులు అన్ని రంగాలలోను ఉంటున్నాయి.గృహిణులు ఇంట్లో ఉండటమే కదా. ఏముంది
డిప్రెషన్ అనుకుంటారు.
కానీ గృహిణి ఇంట్లో పిల్లలకి,శ్రీవారికీ,పెద్దలుంటే వారికి అందరికీ టైమ్ ప్రకారం వారికి కావలసినవిఅమరిస్తేనే కదా వారి డ్యూటీ వారు చేసుకునేది.
వీళ్ళనందరినీ ఇంట్లోంచి బయటకు పంపాలంటే, నిద్ర మంచం మీద నుండే
ఇవాళ టిఫిన్ ,వంట,కూరలు,టిఫిన్ బాక్స్ లు ఇవన్ని ముందుగా ప్లాన్ చేసుకోపోతే గృహిణి కి డిప్రషనే మరి.
చదువుకునే పిల్లలు సంవత్సరమంతా గాలిగా తిరిగితే పరీక్షల టైమ్ కి డిప్రషనే మరి.ఇంకా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వారికి పై అధికారుల హారాజ్ మెంట్ కిడిప్రషనే మరి.ఇంకా సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థులకైతే సరేసరి.
నిద్రుండదు,తిండి ఉండదు,శరీరంలో కదలికలు లేక అనేక రకలైన బాధలతో,పైనుండి అధికారుల వర్క్అవలేదని సతాయింపు దీనితో వారికి
లక్షల్లో జీతాలు వస్తాయేమో కానీ వారు పడే డిప్రషన్స్ మాత్రం వర్ణనాతీతం.
ఈడిప్రెషన్ల బారిన పడకుండా తప్పించుకోవాలంటే ప్రాణాయామం,ధ్యానం,ప్రత్యాహారం ని అలవాటు చేసుకుంటే మనిషి ఏ డిప్రెషన్ నుండైనా బయటపడటానికి మార్గం సుగమమవుతుంది.
దీనినే భగవద్గీతలోపరమాత్మ ద్వంద్వాలకు అతీతంగా ఉండమన్నారు.దానినే స్థితప్రజ్ఞత అంటారు.
అలా మనిషి తన జీవన విధానాన్ని నియంత్రించుకోగలిగితే డిప్రెషన్ మన దరికి రాదు.
-రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి