దేని విలువ పెరిగింది?

దేని విలువ పెరిగింది?

నాకో సందేహం…..
ఏది విలువైనది?
డబ్బు నా!
మనిషి నా!
తాను వాడే వస్తువా!
తాను తినే పదార్థమా!

1 రూపాయికి కిలో మామిడి పండ్లు ఉన్నపుడు తోలు, పిక్కతో సహా తినేవాళ్ళం.
50 రూపాయలకు కిలో ఉన్నప్పుడు తోలు,పిక్క తీసేసి జ్యూస్ పిండుకొని తాగుతున్నాము.

5 పైసలకు 10 చాకలెట్లు వచ్చినప్పుడు. చాకలెట్ కవరుతో సహా నాకే వాళ్ళం.
ఇప్పుడు 10 రూపాయలకు 1చాకలెట్ కొంటున్నాం పూర్తిగా తినకుండానే పడేస్తున్నాం.

కొత్తలో ఫోన్ వాడినప్పుడు నంబర్లు పోయేదాక ఒత్తి ఒత్తి వాడినం.
స్మార్ట్ ఫోన్ వచ్చినంక అద్దం పగిలినా ఫోన్ మారుస్తున్నాం.

రెండు జతల బట్టలను చినిగేదాక తొడిగినం.
వేల రూపాయల బట్టలు రంగు మాయక ముందే మూలకేస్తున్నాం.

ఇప్పుడు చెప్పండి.
విలువ పెరిగింది దేనికి?

విలువైనది అయితే
జాగ్రత్తగా పొదుపుగా వాడుతాం.
బంగారం లాగ.

కామెంట్ ప్లీజ్…….

– కృష్ణ మోహన్

Related Posts