దేశ బంధు

దేశ బంధు

కలకత్తా బార్ అసోసియేషన్ లో సి.ఆర్.దాస్ ఒక ప్రముఖ సభ్యుడు. ఆయన ప్రఖ్యాత జాతీయవాది. ఒకసారి ఓ క్లైంట్ తరఫున వాదించేందుకు ఒక ముఖ్య పట్టణానికి వెళ్ళారు ఆయన. కేసు గెలిచినందుకు క్లైంట్ సొమ్ము బాగా ముట్ట చెప్పాడు.

క్లైంట్ ఆయనను రైల్వే స్టేషన్ కు కారులో తీసుకువచ్చారు ఇద్దరు ట్రైన్ కోసం వేచి చూడసాగారు చివరకు రైలు రాగానే దాస్ ఆయన క్లైంట్ మొదటి తరగతి భోగి వద్దకు వెళ్లారు. దాస్ పెట్టలోకి వెళ్లి బ్రీఫ్ కేసును తన సీటు మీద పెట్టి క్లైంట్ కు టాటా చెప్పడానికి బయటకి వంగారు. రైలు కూత వేసింది. చక్రాలు మెల్లగా ముందుకు కదిలాయి. తర్వాత వేగాన్ని అందుకుoది. త్వరగానే రైలు వేగం పుంజుకుంది.

తన సహప్రయానికి నివాంక చూశారు దాస్ ఆమె ఓ అందమైన యువతీ మంచి బట్టలు ధరించింది బ్రీఫ్ కేస్ ఒడిలో పెట్టుకుని తాను తెచ్చుకున్న ఓ పుస్తకాన్ని తీసుకునేందుకు దాన్ని తెరిచారు దాస్. అప్పుడు అందులో ఉన్న కరెన్సీ కట్టలను ఆ యువతి చూసింది.

పుస్తకంలో లీనం అయిపోయారు దాస్. ఇంతలో తలెత్తి చూస్తే ఆ యువతి హఠాత్తుగా దగ్గరికి వచ్చి

“నీ దగ్గర ఉన్న డబ్బు అంతా మర్యాదగా నాకు ఇచ్చేయ్” అంది.

ఆయన నమ్మలేకపోయాడు. ఒక దొంగతో ప్రయాణం చేస్తున్నాడని అర్థమైంది. ఆ యువతి విసురుగా ఆయన చేతిలోని పుస్తకాన్ని లాగేసి “నేను చెప్పేది వినపడడం లేదా? నీ దగ్గరున్న డబ్బు అంతా నాకిలా ఇచ్చేసేయ్! లేకపోతే..” అని మాటను మధ్యలో తుంచేసింది.

దాస్ పెదవి విప్పలేదు. ఆయన నిశ్శబ్దం ఆమెకు ఇబ్బంది కలిగిస్తోంది. ఆమె బిగ్గరగా “నీ దగ్గర ఉన్న డబ్బు అంతా నాకు కావాలి లేకపోతే గొలుసు లాగి రైలు ఆపివేస్తా. అధికారులు వస్తారు. నీవు నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించావని చెబుతా” అంది.

తాను ఇరుక్కుపోయానని తెలుసుకున్నాడు దాస్. ఆమె ఈ ట్రిక్కును ఉపయోగించి చాలామంది ప్రయాణికులను దోచుకుని ఉంటుంది బహుశా ఈమె వృత్తి దొంగతనమేమో అనుకున్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడేది ఎలా? అని ఆలోచించాడు. చాలాసేపు అలా మౌనంగా ఉండి పోయాడు. చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కనపెట్టి కుడి చెవి దగ్గర అరచేయి పెట్టుకొని

“మేడం ఒక నిమిషం. ఇప్పుడు నా చెవి దగ్గర చేయి పెట్టుకున్నా. ఇందాకట్నుంచి మీరేమో చెబుతున్నారు. నాకు అర్థం కాలేదు. మీరు చెప్పేది ఇప్పుడైనా వినగలుగుతానేమో చూద్దాం! నాకు వినికిడి సమస్య ఉంది. మీరు ఎంత గట్టిగా మాట్లాడగలరో అంత గట్టిగా మాట్లాడండి” అన్నాడు.

ఆయన చెప్పేది ఆమెకు సమంజసమే అనిపించింది. అంతకుముందు తాను అన్న మాటలు ఆయన మీద ప్రభావం చూపకపోవడం అప్పుడు ఆ కొద్దిగా ఆశ్చర్యమైంది ఆమెకు. తాను మాట్లాడగలిగినంత గట్టిగా మాట్లాడదామని నిశ్చయించుకుంది. మళ్లీ గట్టిగా పెద్ద గొంతుతో అరిచి చెప్పింది.

దాస్ అయోమయంగా ఉన్నట్లు నటించి క్షమించమని గొనుకుతూ 

“మేడం మీరు అంటోంది నాకు తెలియకుండా ఉంది. మీరు ఏం చెప్తున్నారు? నాకు ఎలా తెలిసేట్టు? నాకు ఎటు తోచకుండా ఉంది” అన్నాడు.

నోట్ ప్యాడ్ తీసి అందులోంచి ఒక కాగితం చించి ఆమెకు ఇచ్చాడు. పెన్ను కూడా ఇచ్చాడు, “మీరు ఏమంటున్నారో దీని మీద రాయకూడదూ!” అన్నాడు.

ఆ యువతి పెన్నుతో “నీ దగ్గర ఉన్న డబ్బును అంతా మర్యాదగా ఇచ్చేయ్. లేకపోతే రైలు ఆపేస్తా అధికారులు వచ్చినప్పుడు నువ్వు నన్ను బలాత్కరించబోయావ్ అని చెప్తా” అని రాసింది.

తాను రాసిన చీటీని ఇచ్చింది ఆ యువతి. దాన్ని మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు.

“తే డబ్బు తీసి ఇవ్వు” అని ఆ యువతి హెచ్చరించింది.

“మేడం ప్లీజ్.. దయచేసి దయచేసి. బహుశా మీరు ఎప్పుడూ చేయని పని నేను చేసేదా? నేనే గొలుసు లాగుతా! అధికారులు రాగానే మీ విషయం మిమ్మల్ని వారికి అప్పజెప్తా. మీరు ఇంకోటి కూడా తెలుసుకోండి మేడం! నేను చెవిటివాడిని కాదు. మీ బెదిరింపును మీ చేత రికార్డు చేద్దాం అని చెవిటి వాడిలా నటించా. ఇప్పుడు ఆ కాగితం నా దగ్గర ఉంది మీరు తప్పించుకోలేరు”

అంటూ చైన్ లాగడానికి లేవబోతే ఆయన కాళ్ళ మీద పడిందామె.

దేశ బంధు” గా పేరు గడించిన సి.ఆర్.దాస్ గారి జీవితచరిత్ర నుంచి సేకరించిన వాస్తవ సంఘటన.

– మామిడాల శైలజ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress