దేశ భాషలందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంలో…

సేకరించెనొక తేనెటీగ

సంస్కృతమను పుష్పమందు

మకరంద మను తెలుగు భాష

పట్టు పెట్టి పదిల పరచె

తెలుగు ప్రజల గుండెల్లోన…

ఆదికవి పలికిన ఆ తేనె భాష

పలుకుచుండె తెలుగునోట

విశ్వమంతా విస్తరించే

పలికినంత సాయి నోట…

దేశ భాషలందు తెలుగు లెస్స

అన్న రాయలు

వేష భాషలందు తెలుగు మిన్న

అన్న మన సంస్కృతి.

– రమణ మూర్తి

Related Posts