దేశం అభివృద్ధి చెందాలి
మనం దేశం అభివృద్ధి చెందాలి. స్వతంత్రం వచ్చిన
దగ్గర నుండి ఇప్పటివరకు మన దేశం అభివృద్ధి దిశగా
పయనిస్తోంది కానీ దేశంలో
మనం ఆశించినంత అభివృద్ధి
జరగలేదు అనేది మనం గుర్తించాలి. స్వాతంత్ర్యం
రాక మునుపు దక్షిణ
ఆఫ్రికా నుండి మన దేశానికి వచ్చిన గాంధీజీ మన
దేశంలో పర్యటిస్తున్న
సందర్భంలో ఆయన
ఒక విషయం గమనించారు.
మన దేశంలో చాలా మంచి
ప్రజలు తినటానికి సరైన ఆహారం లేక ఆకలితో
అలమటిస్తున్నారు. ఎక్కువ
మంది ప్రజలు పేదరికంలో
మగ్గిపోతూ ఉన్నారు. వారికి
ధరించటానికి సరైన బట్టలు
కూడా లేవు. అప్పుడు ఆయన
ఒక ప్రతిజ్ఞ చేసారట. దేశంలోని
పేదవారికి సరైన బట్టలు, సరైన
ఆహారం లభించే వరకు తాను
ధోతీ మాత్రమే ధరిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేసారట.
దేశంలో పేదరికాన్ని తరిమేసి
అందరి స్ధితి గతులు మారాలి
అని ఆయన ఉద్దేశ్యం. అయితే
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీజీ గారు
స్వర్గస్తులయ్యారు. దశాబ్దాలు గడిచినా
ఇప్పటి వరకు గాంధీగారి కల నెరవేరలేదు.
ఇప్పటికీ మన దేశంలో పేద
వారి సంఖ్య చాలా ఎక్కువగా
ఉంది. దేశం అభివృద్ధి చెందాలి
అంటే ప్రజల ఆర్థిక స్ధితి మెరుగు పడాలి. అలా మెరుగు
పడేలాగా ప్రభుత్వాలు కృషి
చేసినా అది సరిపోవటం లేదని
అర్ధం అవుతూనే ఉంది.
అందరి ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించిన రోజు
దేశం తప్పక అభివృద్ధి చెందుతుంది.
ముఖ్యంగా యువతకు సరైన ప్రోత్సాహం
లభించాలి. అందరికీ మెరుగైన
విద్య అందాలి. అప్పుడే దేశం
అభివృద్ధి దిశగా పరుగులు
పెడుతుంది.