డిటెక్టివ్ ఎపిసోడ్ 9

డిటెక్టివ్ ఎపిసోడ్ 9

హాలులో అటూ ఇటూ పచార్లు చేస్తున్న సిద్ధార్థ అడుగుల శబ్దం విని తలెత్తి అలాగే వుండిపోయాడు. పింక్ కలర్ శారీ లో సుగాత్రి చాలా అందంగా వుంది. ఆలస్యమైనా అందంగా తనకళ్ల ముందుకు వచ్చిన ఐదడుగుల నాలుగంగుళాల అందాన్ని అలానే చూస్తూ వుండిపోయాడు. సుగాత్రికి ఆ చూపులు సిగ్గును పుట్టించాయి, ఒంట్లో వెచ్చని ఆవిర్లు సృష్టించాయి. 

“ఎక్కడో ఓ సరసమైన కథలో చదివాను..గుప్పెడు స్లీపింగ్ వేసుకున్నా నిద్రపట్టనివ్వని అందం” అని నిజంగా చాలా మందంగా చ చ చాలా అందంగా చెప్పాడు రచయిత….” మనఃస్ఫూర్తిగా అన్నాడు సిద్ధార్థ. “పరాయి అమ్మాయిలని ఇలా ఓపెన్ గా పొగడ్డం మర్యాదస్తుల లక్షణం కాదు” చిరుకోపంగా అంది సుగాత్రి. “మరి మనం మర్యాదస్థులం అని ఎవరు చెప్పారు.. పక్కా మాస్.. జులాయి.. దేశముదురు… ఇడియట్.. నేనింతే…” నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ.

“తను మాటల్లో సిద్ధార్థను ఏమార్చలేనన్న విషయం ఆమెకు ఎప్పుడో తెలుసు.. అయినా సిద్ధార్థ తనను, తన అందాన్ని పొగుడుతుంటే బాగానే వుంది… ”ఓకే వెళదామా? అన్నాడు సిద్ధార్థ” ఇంకాసేపు తన అందాన్ని పొగడొచ్చుగా? మనసులో అనుకుంది సుగాత్రి. “పొగడొచ్చు కానీ టైం లేదు.. పైగా నేను నీ అందాన్ని పొగిడితే నీక్కాబోయే ఆయన ఫీలవ్వొచ్చు” అన్నాడు సుగాత్రి వంక చూస్తూ.

గతుక్కుమంది సుగాత్రి..” తన మనసులో ఫీలింగ్స్ ఈ పురుషుడికేలా తెలిసాయబ్బా? “అయినా పెద్ద జాదూ కదా తెలిసే ఉంటుంది” అనుకుంది.. ప్రశ్న జవాబు తనే చెప్పుకుంది. ఇద్దరు బయటకు నడిచారు…

***********

కాఫీ హౌస్ లో లో జేమ్స్ సిద్ధార్చ్ సుగాత్రి కూచున్నారు “జేమ్స్ మాకో హెల్ప్ కావాలి” అన్నాడు సిద్ధార్థ జేమ్స్ వంక చూస్తూ “సర్ నన్ను ఆజ్ఞాపించండి.. చిన్నపుడు టెక్స్ట్ బుక్స్ లో డిటెక్టివ్ నవల్స్ పెట్టుకుని చదివేవాడిని… ఇప్పుడు పెద్ద డిటెక్టివ్ ఎదురుగుగా కూచున్నాను” అతని ఛాతీ రెండు అంగుళాలు పెరిగింది “మేడం ను కూడా కాస్త పొగుడు.. లేకపోతె ఫీలవుతుంది” నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ.

వస్తోన్న నవ్వును ఆపుకుంటూ సిద్ధార్థ వంక కోపంగా చూసినట్టు నటిస్తోంది సుగాత్రి.. చిత్రమేమిటంటే సిద్ధార్థ ఏం మాట్లాడినా బావుంటుంది.. చివరికి కోపంతో కేకలేసినా… “మీ గురించి పొగిడితే మేడం ను పొగిడినట్టే.. మీరిద్దరూ ఇద్దరే… సిబిఐ అంటే సినిమాల్లో పుస్తకాల్లో తప్ప రియల్ లైఫ్ లో చూడలేదు.. పైగా మేడం చాలా అందంగా వుంటారు.. ఆఖరిపోరాటంలో శ్రీదేవిలా” అన్నాడు జేమ్స్.

“సరే.. ముందు నువ్వు అర్జెంటు గా యాక్టర్ అయిపోవాలి… యాక్టింగ్ లో చించేయాలి.. అన్నట్టు మీ ఆవిడకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అడిగాడు సిద్ధార్ధ “నా పక్కనా? కాస్త నీరసంగా అన్నాడు జేమ్స్ సిద్ధార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు జేమ్స్ చిన్నగా నవ్వి “మరేం లేదు సర్… పండుగరోజు కూడా..” అని ఎదో సామెత గుర్తొచ్చి.. అయినా మా ఆవిడకు టీవీ అంటే మహాపిచ్చి…

ఛాన్స్ ఇవ్వలేదని ఫీలవుతుంది కానీ ఛాన్స్ ఇస్తే “పాడుతా తీయగా నుంచి డాన్స్ బేబీ డాన్స్ నుంచి బిగ్ బాస్ వరకు దేన్నీ వదిలిపెట్టదు.. ఇంతకు రియాల్టీ షోనా? టీవీనా? సినిమానా?” అడిగాడు ఉత్సాహంగా జేమ్స్… “ఇంచుమించు రియాల్టీషో అనుకో…. అన్నాడు సిద్ధార్థ” “అంతే కదా సర్ ? ఆ డి గాడు ” మన ఆపరేషన్ లో ఒకభాగం… నువ్వు ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు.. భవిష్యత్తులో నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చు కూడా… కావాలంటే సుగాత్రి మేడం రెకమండ్ చేస్తుంది” అన్నాడు సుగాత్రి వైపు తిరిగి.. సుగాత్రి ఓ నవ్వు నవ్వింది.

చిరుకోపంగా సిద్ధార్థ వైపు చూసింది “నేను ఓకే కానీ మా ఆవిడా ఒప్పుకోదే.. తనకు కెమెరా కనిపించాలి.. టీవీలో కనిపించాలి. అందరూ తనను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ అడగాలి” “టీవీలో బేషుగ్గా కనిపిస్తుంది. అంతే కాదు ఆటోగ్రాఫ్ లూ అడుగుతారు. కాకపోతే కెమెరాలు వున్న విషయం మీ ఆవిడకు తెలుసన్న విషయం అందరికీ తెలియకూడదు. స్పై కెమెరాలు ఉంటాయి… రెమ్యూనరేషన్ కూడా ఉంటుందని చెప్పు..” అన్నాడు నవ్వుతూ…

“ఇంతకూ మా క్యారెక్టర్స్ ఏమిటి సర్…? అడిగాడు ఆసక్తిగా జేమ్స్.. అతనికి థ్రిల్లింగ్ గానే వుంది… సినిమాల్లో చూసినట్టు. కాకపోతే మళ్ళీ తనను ఏ దొంగసచ్చినోల్లో వచ్చి గోడౌన్ లో కట్టిపారేయరుగా….” అనుకున్నాడు మనసులో జేమ్స్ “ఈ సారి అలాంటి ప్రమాదం ఏమీలేదు జేమ్స్. నిన్నెవరూ గోడౌన్ లో కట్టి పారేయరు” అన్నాడు సిద్ధార్థ.

జేమ్స్ ఆశ్చర్యంగా సిద్ధార్ద వైపు చూసి “సర్ నేనిప్పుడు బయటకు మాట్లాడానా… స్వగతంగా మాత్రమే గొణుక్కున్నా.. మీకెట్లా వినిపించింది సర్?” అడిగాడు “తావీదు మహిమ” కచ్చగా అనుకుంది సుగాత్రి “ఇదే విషయం ఒకసారి అడిగితే సిద్ధార్థ చెప్పిన సమాధానం “తావీదు మహిమ” అని సిద్దార్థ సుగాత్రి వైపు తిరిగి జేమ్స్ వైపు చూసి “తావీద్ మహిమ” మాత్రం కాదు అన్నాడు. “ఇంతకూ నా భార్య నేను చేయవలిసిన క్యారెక్టర్స్ ఏమిటి సర్? లొకేషన్ అన్నపూర్ణ స్టూడియోనా? అడిగాడు జేమ్స్ “రామోజీ ఫిలిం సిటీ వద్దా? నవ్వుతూ అని ఆ వెంటనే.. “కాదు కరూర్ జంక్షన్” చెప్పాడు సిద్ధార్థ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు… అష్టదిగ్బంధనం మొదలైంది.

విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ పోలీస్ అధికారులు డిజిపి సుగాత్రి సిద్ధార్థ వున్నారు ముంబై ఢిల్లీ నుంచి వచ్చిన పోలీస్ అధికారులు కూడా వున్నారు సిద్దార్థ లేచాడు . అందరూ సిద్ధార్థ చెప్పబోయేది వినడానికి సిద్ధంగా వున్నారు అందరినీ విష్ చేసి గొంతు సవరించుకున్నాడు ” ఇప్పటివరకూ అతితక్కువ వ్యవధిలో డ్రగ్స్ వ్యాపారం వేలకోట్లతో సాగింది. చాప కింద నీరులా డ్రగ్స్ పిల్లల శరీరాల్లోకి వెళ్తుంది. యువత డ్రగ్స్ కు బానిస అవుతుంది. మిస్టర్ డి నయా ట్రెండ్ మరొకటి వుంది” అని ఆగి ఒక్కసారి అందరి వైపు చూసాడు.. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్…

The end

– భరద్వాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *