ధైర్యాన్ని పంచండి

ధైర్యాన్ని పంచండి

మనసు గాయపడితే మనిషికి బాధ కలుగుతుంది.అలా బాధ కలిగిన మనిషి నిరుత్సాహానికి గురి అవటం జరుగుతుంది.

ఆ మనిషికి జీవితం అంటే విరక్తి కలిగి చివరకు ఒక రోజున ఆత్మహత్య చేసుకుంటారు.

ఒంటరిగా జీవిస్తున్నప్పుడు,ప్రేమలో విఫలం అయితే, పరీక్ష తప్పినప్పుడు , ఉద్యోగం
రానప్పుడు ఇంకా అప్పులపాలైన పరిస్ధితులోమనిషికి ఏమి చేయాలో పాలుపోదు.

అలా అసహాయ స్ధితిలో ఉన్న మనిషికి ధైర్యం చెప్పే మితృలు లేకపోతేడిప్రెషన్ కు గురి అవుతాడు.

మనిషికి ధైర్యం, ఆశ ఉండాలి.భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనే ఆశతోపాటు ఏమి జరిగినా ధైర్యంగా ఎదుర్కుంటాను అని ధీమా ఉన్న వ్యక్తులు ఏ డిప్రెషన్ కు గురి అవరు.

నిరుత్సాహంగాఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వారికి ధైర్యం పంచాలి. మీరు ధైర్యస్తులైతే సరిపోదు. మీ మితృలు, కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా జీవితాన్నిగడిపేందుకు మీ ధైర్యాన్నివారికి పంచాలి.

డిప్రెషన్ కు మందులు ఉన్నా కూడాతోటి మనిషి ద్వారా లభించేస్వాంతన అతనికి మనోధైర్యాన్ని ఇస్తుంది.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *