ధరణి రెండవ భాగం

ధరణి రెండవ భాగం

ధరణి అందమైన అమ్మాయి పుట్టగానే తల్లిని తాత ను పొట్టన పెట్టుకుందనే కారణం తో తండ్రి నాన్నమ్మ ఆదరణ ప్రేమ కరువైనా కూడా బాధ పడకుండా చిన్న తనం లోనే పనులన్నీ చేస్తూ అణుకువగా ఉంటున్న సమయంలో పుట్టిన రోజు నాడు నానమ్మ తిట్టడం వల్ల ఏడుస్తూ ఉన్న కూతురి దగ్గరకు తండ్రి వచ్చి తానూ తప్పు చేశాను అని క్షమించమని స్నేహితుడి వల్ల నిజాన్ని తెలుసుకున్నా అని ధరణి తో అంటాడు.

మీరేం తప్పు చేయలేదని ధరణి అనడం తో పుట్టిన రోజున కొత్త బట్టలు వేసుకోవాలనీ తీపి తినాలని బట్టలు స్వీట్ తెచ్చాను. వెళ్లి వేసుకుని రమ్మని అనడం తో ధరణి వేసుకుంటుందిఇదంతా చూస్తున్న నానమ్మ అనసూయమ్మ అసూయా తో రగిలి పోతుంది. ధరణి వల్లే తన భర్త చనిపోయాడనే కోపం లో ఉంటుంది అనసూయమ్మ మరి ఇప్పుడు అనసూయమ్మ ఏం చేయబోతుందో చదవండి…

*******

అమ్మో అమ్మో నా కొడుకును వలలో వేసుకుని నాకు కాకుండా చేస్తావా ? నీకెంత ధైర్యమే ?  అంటూ ధరణి ని కొట్టడానికి వచ్చింది అనసూయమ్మ  చెంచు రామయ్య గబుక్కున వచ్చి  తల్లి చేయి పట్టుకుంటూ అమ్మా ఆగు ఏం చేస్తున్నావు?

అసలు నా కూతుర్ని కొట్టడానికి నీకెంత ధైర్యం ఇన్ని రోజులు దాన్ని కొడుతున్నా తిడుతున్నా ఏమి అనలేక పోయాను. కానీ ఇక నీవు దాన్ని ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను కన్నతల్లివి అని ఇన్ని రోజులు ఏమి అనలేదు. కానీ ఇక ఇప్పుడు ఉపేక్షించను.

అసలే అది తల్లి పోయిన దుఖం లో ఉంటె నువ్వు దాన్ని ఇన్నాళ్ళు ఎంతో బాధ పెట్టావు. కానీ ఇప్పుడు నేను తనని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండను  తనని ఎమన్నా ఊరుకునేది లేదు అన్నాడు చెంచురామయ్య.

అనరా అను నన్నే అంటావురా కన్న తల్లిని పట్టుకుని ఇన్నేసి మాటలు అంటావా ? నీకసలు బుద్ధి ఏమైనా ఉందా ? మహా రాజు ఆయన  తన మా నాన తను వెళ్ళిపోయాడు.ఆయనతో పాటు నేను పోయినా  అయిపోయేది.

ఇదిగో ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం తప్పేది. అయ్యో నా రాత ఇన్నేళ్ళు బతికి ఇప్పుడు ఇంటెనకాల సచ్చినట్టు ఈ దినానికి నన్ను నా కడుపున పుట్టినవాడు ఇంతేసి మాటలు అంటుంటే అడిగే దిక్కు దివాణం లేకపోయినా నాకు నా మొగుడు ఇచ్చిన ఇల్లుంది.

దీంట్లో ఎవరికీ వాటా లేదు. ఇది మా భార్య భర్తల కష్టార్జితం. కాబట్టి  మీరే పొండి అవతలికి అంది ఏడుపు గొంతుతో. తన వల్ల తండ్రి నాయనమ్మ ని వదిలేసి వెళ్తే తనకి దిక్కు ఎవరు ఉండరని ఆలోచించిన ధరణి నాయానమ్మ…

నాన్న ఎదో కోపం లో అన్నాడు. కానీ వదిలెయ్యి నాన్నమ్మ దయచేసి నువ్వు లోపలికి వెళ్ళు నాన్నమ్మ అంది. దానికి అనసూయమ్మ కోర కోరా చూస్తూ  ఎందుకు వెళ్తానే  అ ఎందుకు వెళ్తా నేను పోను వెళ్తే గిల్తే మీరే వెళ్లిపోవాలి కానీ ఇక్కడ ఎవరు ఉత్త పుణ్యానికి ఉండకూడదు.

వెళ్ళండి అవతలికి నా ఇంట్లో ఉంటూ  నా తిండి తింటూ  నాకే ఎదురు చెప్తారా  హన్నా పొండి అంటూ  రంకెలు వేస్తున్న తల్లిని చూస్తూ..

చెంచు రామయ్యకోపంగా ఛి చీ దరిద్రపు కొంప  ఒక్క రోజైనా మనశ్శాంతి గా ఉండనివ్వరు ఛి ఛి బయట గుడిసె వేసుకుని అయినా ఉండొచ్చు కానీ శత్రువుల మధ్య ఉండకూడదు. రామ్మా ధరణి  మనం వెళ్ళిపోదాం పద అంటూ ధరణి చేయి పట్టుకుని ముందుకు నడిచాడు చెంచు రామయ్య.

వెళ్ళండి  వెళ్ళండి ఎక్కడికి వెళ్తారో నేను చూస్తా  పెళ్లి కావాల్సిన పిల్లను పెట్టుకుని ఎక్కడికి వెళ్తావో అంది. అక్కసుగా కానీ చెంచురామయ్య వెనక్కి తిరిగి తల్లిని చూస్తూ… బిక్షం ఎత్తుకుని ఆయినా దాని పెళ్లి గుళ్ళో  అ యినా చేస్తా కానీ మళ్ళి నీ గడప తొక్కను.

ఇన్ని రోజులు గొడ్డులా పనిచేసింది నా కూతురు. నీకు సర్వ శాకిరీ చేయించుకున్నావు ఈ రోజు దాని పుట్టిన రోజ ని ఎదో కొత్తబట్టలు తెస్తే అది కట్టుకోవడం చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటావా అసలు నువ్వు ఆడదానివేనా ఆడదానికి ఆడదే శత్రువు అని ఊరికే అనలేదే నిన్ను చూసే అని ఉంటారు తల్లి పోయిన దాన్ని ప్రేమగా చూడకపొగా దాన్ని ఒక శత్రువుని  చేసావు.

ధరణి రెండవ భాగం
ధరణి రెండవ భాగం

నీ భర్త పోయింది పాము కరిచి కానీ నా బిడ్డ పుట్టిన్నందుకు కాదు.రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళే పిల్లను పట్టుకుని ఎన్నేసి మాటలు అన్నావునువ్వు నాయనమ్మవు కాబట్టి అది నా ముఖం చూసి ఇన్నాళ్ళు ఊరుకుంది. కానీ ఇక నేనే ఊరుకోను ఇంకొక పిల్లే అయితే ఎప్పుడో నీ నడ్డి విరగొట్టి మూలకు పడుకో బెట్టేది.

తల్లివి పెద్దదానివి అని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇక పట్టను హ ఇంకో సంగతి ధరణి పెళ్లి కుదుర్చుకోచ్చాను. ఈ రోజు కు  వారం రోజులుంది పెళ్లి ఎవరులేరని  గుళ్ళో పెళ్లని ముందే వాళ్ళకు చెప్పాను. ఇప్పటి నుండి  ఇంత ఇంట్లో నువ్వొక్క దానివే ఉండి ఊరేగు నీ దగ్గరికి ఇంకెవరురారు. పదమ్మ ధరణి వెళ్దాం అన్నాడు చెంచురామయ్య. ఇటూ తిరిగి…

అయ్యో నాన్న పాపం నాన్నమ్మని ఒంటరిని చేయ్యోద్దు నాన్న  పాపం తనకు మాత్రం ఎవరున్నారు. తనని మనం మనకు తానే కదా నాన్న వద్దు నాన్న ఇక్కడే ఉందాం నాన్న అంటున్న ధరణిని చూస్తూ రామయ్య అమ్మా ధరణి నీకు తెలియదమ్మా…

మా అమ్మ సంగతి మీ అమ్మను కూడా ఇలాగె రాచిరంపాన పెట్టేది. పాపం మీ అమ్మ నాతో చెప్పుకోలేక  అటూ అత్తగారికి ఎదురు చెప్పలేక ఎంతో అవస్థ పడింది. నువ్వు పుట్టిన రోజు కూడా అంతే ఆడపిల్లని కన్నావు అంటూ ఏవేవో తిట్టేసరికి పాపం మీ అమ్మకు ఏం చేయాలో తెలియక ఉరేసుకుని చనిపోయింది.

అది నాకు ఎక్కడ తెలుస్తుందో అని  ఉరిని తీసేసి వాతం కమ్మి చనిపొయింది అని అబద్ధాలు ఆడింది నా తల్లి . కానీ నా భార్య మెడ నాకు నిజాన్ని చెప్పింది. ఇంతలో నాన్నకు పాముకరిచిందని తెలిసి నేను అక్కడికి వెళ్లి వచ్చేసరికి నాకు చివరి మాట కూడా దక్కనివ్వలేదమ్మ  అంటూ కళ్ళు తుడుచుకున్నాడు చెంచు రామయ్య.

తన తల్లి చావుకు కారణమైన నాన్నమ్మ మీద పికల దాక కోపం వచ్చినా ధరణి నాన్నమ్మ దగ్గరగా వెళ్ళింది ధరణి కి విషయం తెలిసి కోపంగా నానమ్మ దగ్గరికి కదిలిన ధరణి ని చూస్తూ  తనని వచ్చి కొడుతుందేమో అని రెండు అడుగులు వెనక్కి వేసింది అనసూయమ్మ భయంతో.

కానీ దగ్గరగా వెళ్ళిన ధరణి చటుక్కున నాయనమ్మ కాళ్ళ మీదపడుతూ నాయనమ్మ నా ఇంటికి మాత్రం రాకు అని మొక్కి పద నాన్న అంటూ తండ్రి చేయి పట్టుకుని ముందుకు నడిచింది.

తన నిజస్వరూపం తన కొడుక్కి ఇన్నాళ్ళు తెలియదేమో అనుకున్న అనసూయమ్మకు తన నిజరుపాన్ని ఆధారాలతో  సహా కొడుకు చూపించేసరికి బుర్ర గిర్రున తిరిగి పోయి వెళ్తున్న వారిని అలాగే బిగుసుకు పోయి చూస్తూ నిలబడింది అక్కడే.

కనీసం వెళ్ళకండి వద్దు అని కూడా అనకుండా ఒక శిలలా బిగుసుకు పోయింది అనసూయమ్మ .. ఉన్న నీడను వదులుకొని బయటకు వెళ్తున్న తండ్రి కూతుర్లు ఇద్దరి గమ్యం ఏమిటి?

వారంరోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇప్పుడిలా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన చెంచురామయ్య తన ఒక్కగానొక్క కూతురి పెళ్లి ఎలా చేయగలడు? చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో వయస్సుకు వచ్చిన కూతుర్ని తీసుకుని చెంచురామయ్య పయనం ఎందాకా ?ఈ ప్రశ్నలన్నిటికి సమధానం కావాలి అంటే తదుపరి భాగం లో చదవండి.

 – భవ్య చారు 

Related Posts

1 Comment

Comments are closed.