ధరిత్రీ

ధరిత్రీ

ధరణి వొడిలోనిపసిపాప లు
పంచభూతాల అంశాలే
జీవకోటి సమస్తం.

సిరిసంపదల నిధులు
అక్షయ పాత్రలా ఆహారం
పుడమితల్లి సొంతం

పచ్చని అడవుల ప్రాకారాలు
జంతుజాతుల సమూహాలు
అరణ్యాల సరిహద్దులు
కొండా కోనల విన్యాసాలు
ప్రకృతిమాత అనుగ్రహం

పుత్తడిగనులు విరిసిన
పూతోటలు సముద్రపు
జలచరాలు పక్షుల కిలకిలా
రావాలు వన్య ప్రాణుల
క్షేత్రంభూదేవి స్వధర్మం.

ప్రకృతి సహచర్యాన్ని వదిలి
ప్రయోగ వేదిక అవుతుంది
అవని లోని అద్భుతాల
అన్వేషణ కోసం.

అదేమానవాళి మనుగడ కు
పొంచి వున్న ముప్పు

ప్రగతి రథాలు పరుగిడినా
సాధించిన విజయాలు
మానవుడి మాయాజాలంతో
మట్టి విలువ మాత్రం
మరచి పోతున్నారు .

అదే శాపమై కరోనా
గుణ పాఠం తో మొదలు
పెట్టిందివిశ్వానికిహెచ్చరిక లా

ప్రమాదపు గంట విపిస్తున్నా
ప్రకృతి ప్రళయాలు చూపినా భాద్యత నాది కాదని
చూస్తున్నాం మనుషులందరూ

భూతాపం పెరిగి
మంచుల కొండలు కరిగి
ఊహించని ఉత్పాతాలు
కలిగి విచక్షణ లేని
ప్లాస్టిక్ వియోగం పెరిగి
వనరులు కరిగి
పీల్చే గాలి
తినే తిండి
వుండే నీడ
పంచ భూతాల సమన్వయం లోపిస్తే
లక్షల జీవరాసులు ఆధారం
అయోమయం అయితే
సమాధానం మిగలదు.

అన్ని అవసరాలు తీర్చిన
ధరిత్రి కి ఋణం తీర్చాలి
మనం.
ప్రకృతిసంరక్షణ
ప్రతి పౌరుడి భాద్యత

భావి తరాలకు మనమిచ్చే
బంగారు భవిష్యత్తు …….?

 

– జి జయ

Related Posts