ధర్మం

ధర్మం

ఏది ధర్మం… ఏది న్యాయం
మనసులో మలినాన్ని నింపుకోని
నీ.. స్వార్థమే ధ్యేయంగా
తీయని మాటలతో…
నంగనాచి నాటకాలతో…
అవసరానికి ఆత్మీయంగా
మాయతో మాటలు కలిపి…
అవసరం తీరాక…..
ఏరుదాటి తెప్పను తగిలేసినట్టు
ఎంత స్వార్థం.. ఎంత మోసం…
ఓ మనిషి…!
ఇదేనా నీ ధర్మం.. ఇదేనా నీ న్యాయం..!?
– అంకుష్

Related Posts