డిటెక్టివ్ బామ్మ

డిటెక్టివ్ బామ్మ

డిటెక్టివ్ బామ్మ

 

ఒరేయ్ బడవా..వాడు వెంట పడుతున్నాడు రా.త్వరగా రా ఈ బుట్ట లో దూరుదాం అక్కయ్ నువ్వు ఏమయినా సన్నజాజి తీగ ల వున్నావని అనుకుంటున్నావా?బియ్యం బస్తాల వున్నావు.

ఒరేయ్ చిన్నప్పటి నుండి నా దగ్గరే వుండి సచ్చావ్ అని ఉరుకుంటు వుంటే తెగ రెచ్చిపోతూ వాగుడు కాయ ల వాగుతు చస్తావు.త్వరగా రా లేదంటే వాడి చేతిలో లారీ కింద పడ్డ బూడిద గుమ్మడి ల అయిపోతవు.

అవును అక్కో..వస్తున్న పదా..ఇందులో ఇద్దరం పడతాం అంటవటే అక్కాయ్..సర్దుకోవాలి అంతే .అని ఒక పెద్ద తడికల బుట్ట కింద దూరి కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నారు సూర్యకాంతం తన అసిస్టెంట్ ఆనంద్.

హమ్మయ మొత్తానికి తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డాం అదే పది వేలు అన్నాడు ఆనంద్.ఎక్కడ ఆ వెధవలు తప్పించుకున్నారు కానీ లేదంటే ఈ డిటెక్టివ్ సూర్యకాంతం చేతిలో చచ్చేవారు.

ఇదిగో అక్క… వాళ్ళు కాదు మనం తప్పించుకున్నాము.లేదంటే ఈ పాటికి మనకి పిండం పెట్టేవాళ్ళు.యేహే వుండర.రామేశ్వరం వదిలిన శనేష్వరం వదల లేదట అల వుంది .వాళ్ళు పోయిన నువ్వు వధలవేమి రా వెధవ.

అక్కా మళ్ళీ వచ్చారే .పరుగు తీయ్యి….ఆగర నేను కూడా వస్తున్నా..వామ్మో నన్ను పట్టేసుకున్నారు రా…ఒరేయ్ ఆనందు ఆగరా.

వదలండి రా నన్ను వదలండి.నా తప్పు ఎం లేదు రా వాడు డబ్బులు ఇస్తే కేస్ డీల్ చేసా.మిరెనని ఎవరికి చెప్పను మా నాయన కదు వదిలేయండర్ర మీకు పుణ్యం వుంటుంది.

ఒరేయ్ ఆనందు …ఒరేయ్ ఆనందు ఆగరా…ఒక్కసారి గా కాలం ఆగినట్టు అయ్యింది కాంతానికి.కంతక్క కంతాక్క అంటూ ఎవరో తననీ గట్టిగా పట్టుకుని కదిపినట్టు అయ్యింది.బలవంతం గా కళ్ళు తెరిచి చూసింది.ఆనందు కాఫీ పట్టుకొని వున్నాడు.

హూ…ఇదంతా కల నిజమనుకొని హడలి పోయా….హా….ఇది రోజు వుండే తంతగమేగ అలవాటు అయిపొయింది నాకు.కలలో అయిన కేసులు వస్తున్నాయి సంతోషం.ఏడాది అవుతుంది కానీ ఇప్పటికీ ఒక్క కేస్ కూడా లేదు అని మనసులో అనుకున్నాడు.ఒరేయ్ నాకు వినపడింది.వస్తాయి లే…తొందర ఎందుకు ఈ కాంతం …సూర్యకాంతం గురించి తెలియని తెలుగువాళ్లు లేరు ఎం అనుకున్నావు..

ఎదో బాండ్ జేమ్స్ బాండ్ అన్నట్టు చెప్తారు ఏమిటి.కొన్ని రోజులు ఆగరా …రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ అని నీతోనే అనిపిస్త.సరేలే అక్కా.టిఫిన్ అయ్యింది వచ్చి తిను అంటూ కాఫీ కప్పు పట్టుకొని వెళ్ళిపోయాడు.

హ్మ్మ్….నా కల ఎప్పుడు నెరవేరుతుంది అని అనుకుంటూ దూప్పటి మడతేసి లోపల పెట్టింది పాతికేళ్ల సూర్యకాంతం…

గయ్యాళి అత్తగా …అందరి మన్ననలు పొందిన మహావ్యక్తి సూర్యకాంతం గారు..కామెడీ నీ పండిస్తునే మరో వైపు రాచి రంపాలు పెడుతూ అందరితో తిట్లని ఆశీర్వాదాలు గా అందుకున్న వారు పాతికేళ్ల వయసులో హీరోయిన్ పాత్ర తో ఎలా వుంటారా అని ఆలోచిస్తూ హాస్యం గా రాసిన చిన్న కథ…

 

భరద్వాజ్

దోశలు కావాలా బాబూ. Previous post దోశలు కావాలా బాబూ.
ఫిర్యాదు Next post ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close