దొంగచాటుగా

దొంగచాటుగా

అదొక యవ్వనపు ఝరి..
నూనూగు మీసాలు వచ్చాయి మరి.
కళాశాలలో ఎందుకో నా మనసు జారి..

ఏంటీ అని నా మనసుని అడుగగా.
ప్రేమ కావాలంటూ ఆశగా..
మిత్రుని వీపే మాటుగా..
వనితల పై నా కనులు వాలగా..
చూశాను ఓ చూపు దొంగచాటుగా..

ఏం జరుగుతుందో తెలియని క్షణాన..
ఏమైనా చేయాలనే భావన..
పలకరింపు కావాలనే తపన..
మొదట స్నేహమై మెరిసింది మా మధ్యన..

ఆపై స్నేహ బంధమే వెరసి..
నేడు ఏక బంధమై కలిసి..
మా మనసులు మురిసినవి..
మా జీవితాలు పండినవి..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts