డీపీ దొంగలు

డీపీ దొంగలు

ఏయి నేను ట్విట్టర్ లో ఈ మధ్య అకౌంట్ ఓపెన్ చేశాను ఎలాంటి డీపీ పెట్టాలో తెలియడం లేదే అంది దీపిక భవ్య తో

ఆ ఏముంది ఏ రోజా పువ్వో లేదా నికు నచ్చిన హీరో పిక్ లేదా హీరోయిన్ పెట్టుకో అంది భవ్య తేలిగ్గా ఛా ఛా అలా తేలిగ్గా తిసెయ్యకే ప్లీజ్ నేను అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా పెట్టాలని ఉంది.

ఏదైనా ప్లాన్ చెప్పొచ్చు కదా అంది దీపిక ఓర్ని నీ ఏషాలు ఏదో ఒకటి పెట్టుకోకుండా నీ నస ఎంటి ఇప్పుడు ఏం పిక్ పెట్టాలని హా సర్లే అవేవో పింట్రెస్ట్ లాంటివి , గూగుల్ లో వెతికితే బోలెడు దొరుకుతాయి వేళ్ళు వెళ్లి వెతుక్కో పో అంది చిరాకుగా భవ్య.

నీతో అన్నాను చూడు నాది బుద్ది తక్కువ అంటూ కోపంగా వెళ్ళిపోయింది దీపిక .

సిస్టం ముందు కూర్చున్న భవ్య కు దీపిక అలా బాధ పడుతూ వెళ్ళడం నచ్చలేదు. తను పైకి దీపికను విసుక్కున్నా లోపల మాత్రం తనకు ఒక మంచి డిపి చేయాలని అనుకుంది.

సిస్టం ముందు కూర్చున్న భవ్య కాన్వ ఓపెన్ చేసి అందులో కొన్ని బొమ్మలు చూస్తూ కూర్చుంది.దాంతో భవ్యకి ఒక ఐడియా వచ్చింది. దాంతో భవ్య దీపిక కోసం ఒక అందమైన ,అమ్మాయి బొమ్మ తయారు చేసి,దాన్ని డిపీ కి తగినట్లు గా సెట్ చేసింది.

అన్ని విధాలా బాగుంది అనుకున్న తర్వాత దీపికా దీపికా అంటూ గట్టిగా అరిచే సరికి ఏమిందే అంటూ వచ్చిన దీపిక సిస్టం తిప్పి నవ్వుతూ చూస్తున్న భవ్యాని అలాగే సిస్టం లో ఉన్న పిక్ నీ చూసి వావ్ సూపర్ ఉందే ఎలా చేశావ్ నా కోసమేనా, వావ్ భవీ నువ్వెంత మంచి దానివే నన్ను కొప్పడినా నా కోసం రెఢీ చేశావ్ థాంక్యూ ఇది నేను నా డి పీ గా పెట్టుకుంటా, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంచుతా మన ఫ్రెండ్ షిప్ కి గుర్తుగా జీవితాంతం మర్చిపోను ఆంటూ గట్టిగా హత్తుకుంది దీపిక.భవ్య నవ్వుతూ నిన్ను సంతోషంగా చూడడమే నాకు కావాల్సింది అంది. వారి స్నేహం అలా ఇంకా బల పడింది.

చదువుల కోసం ఉత్తర దక్షిణ దృవాల నుంచి వచ్చిన వారిద్దరూ హాస్టల్ రూమ్ లో రొమాన్స్ అయ్యారు అలాగే మంచి స్నేహితులు కూడా అయ్యారు అందువల్లే దీపికకు భవ్య అలా డిపి చేసి ఇచ్చింది ఇది జరిగిన తర్వాత వారి చదువుల్లో పడి ఆ విషయం మర్చిపోయారు పరీక్షలు అయిన తర్వాత ఒకరిని విడిచి ఒకరు వదలలేక వదలలేక వదిలి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇద్దరి జీవితాలలో అనుకోని పెను మార్పులు సంభవించాయి. దీపిక మంచి జాబ్ తెచ్చుకొని అమెరికాలో స్థిరపడిపోయింది కానీ భవ్య మాత్రం తన ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇంకా పై చదువులు చదువుకోలేక తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం చేసుకొని ఒక మధ్యతరగతి ఇల్లాలుగా స్థిరపడిపోయింది. వారిద్దరికీ పిల్లలు కూడా పుట్టారు వారు చదువులు వారి బాధ్యతల్లో చాలా బిజీ అయిపోయారు.

హాస్టల్ నుంచి వెళ్లిపోయిన కొత్తలో ఉత్తరాలు ఫోన్లు చేసుకున్న తర్వాత ఉత్తరాలు ఫోన్లు తగ్గిపోయాయి నెంబర్లు మారిపోయాయి. అందువల్ల వారి మధ్య ఉండే రిలేషన్ దాదాపు తెగిపోయినట్లే అయింది.

కొన్నాళ్ల తర్వాత బాధ్యతలన్నీ తీరి కాస్త సేద తీర్చుకుంటున్న భవ్య తన కొడుకు కొనిచ్చిన మొబైల్ కొత్త ఫోన్లో ఒకరోజు భవ్య తీరికగా తన ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు ట్విట్టర్ అని కనిపించింది దాంతో తను అది ఇన్స్టాల్ చేస్తుంది..

అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని కొన్ని కొన్ని మంచి మంచి మాటలు పెట్టడం మొదలుపెట్టింది అలా ఆమెకి చాలామంది స్నేహితులు అయ్యారు అలా ఒక రోజు చూస్తున్నప్పుడు సరిగ్గా దీపికకి ఏదైతే తాను చేసి ఇచ్చిన డిపి ఉందో అలాంటిదే కనిపించేసరికి ఉబ్బితబీపై పోయిన భవ్య వెంటనే ఫాలో చేసింది.

ఆ తర్వాత తనకి మెసేజ్ కూడా పెట్టింది హాయ్ దీపిక బాగున్నావా అంటూ, ఆ వెంటనే రిప్లై వచ్చింది నేను దీపిక కాదు నా పేరు ప్రియాంక మీరెవరు అంటూ దాంతో ఆశ్చర్యపోయిన భవ్య ఏంటి నీ డిపి ఇలా పెట్టుకున్నావు అని అడిగేసరికి ఆ ప్రియాంక అనే ఆవిడ మీరెవరో చెప్పకుండా నా డిపి గురించి ఎందుకు అడుగుతున్నారు నాకు నచ్చిన డిపి నేను పెట్టుకున్నాను అసలు ఇంతకీ మీరెవరు అంటూ తిట్టేసరికి భవ్య ఏమి అనలేకపోయింది.

అలా మళ్లీ తిరిగి చూస్తున్నప్పుడు అదే డిపి తో ఎన్నో అకౌంట్ పంపించాను భవ్య ప్రతిసారి అందరికీ మెసేజ్లు పెట్టడం తిట్లు తినడం ఒక్క పరిపాటిగా మారిపోయింది. కానీ భవ్యకి మాత్రం అసలు దీపిక దొరకనే లేదు.

దాంతో భవ్య ఆలోచనలో పడింది. అసలు ఒకరు పెట్టుకున్న డిపి ని ఇంకొకరు ఎలా దొంగతనంగా తీసి పెట్టుకుంటారు ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి ఉంటుంది వాళ్ల మనస్తత్వం తీరున డీపీలు తయారు చేసుకొని పెట్టుకుంటారు.

తమ పేరును లేకపోతే ఏదైనా అందమైన పుష్పాన్ని లేక హీరో హీరోయిన్లను గాని లేకపోతే ఒక మంచి పుస్తకం కానీ అలా రకరకాలుగా పెట్టుకుంటారు అలాంటిది ఒక నేనే తయారు చేసి చూడండి ఎంతమంది పెట్టుకుంటే ఇది దొంగతనం చేసినట్టు కదా డిపి బాగున్నంత మాత్రాన దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ల డిపి గా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ నేను దీపికనే ఎలా గుర్తుపట్టడం తనని ఎలా కలవాలి మళ్లీ అనే ఆలోచనలో పడిపోయింది భవ్య.

అలా ఒకరోజు సడన్గా భవ్యకి హాయ్ భవ్య అంటూ ఒక మెసేజ్ వచ్చింది ఆ డిపి చూస్తే అందులో అమ్మవారి ఫోటో ఉంది పేరు దీపిక అని ఉంది దాంతో ఆశ్చర్యపోయిన భవ్య ఆ మెసేజ్ కి రిప్లై ఇస్తూ ఏంటి నువ్వు దీపికవేనా అంటూ అడిగింది.

ఆ అవును నేనే దీపికని ఎలా ఉన్నావ్ చాలా రోజులకి కనిపించావు ఎకౌంటు ఓపెన్ చేసి ఎన్ని రోజులు అయింది అంటు ప్రస్తుత వర్షం కురిపించింది దీపిక. నేను ఓపెన్ చేసి చాలా రోజులు అయింది నీ కోసం వెతుకుతున్న నేను చేసిన డిపి కనిపించేటప్పుడు అల్లా నువ్వే అనుకుంటాను అందరికీ మెసేజ్లు పెట్టి తిట్లు కూడా తిన్నాను అంటూ జరిగిన విషయాలన్నీ దీపికతో పంచుకుంది భవ్య.

అప్పుడు దీపిక తన బాధని భవ్యతో పంచుకుంది. ఏం చెప్పమంటావ్ బాబి నువ్వు నాకోసం స్పెషల్ గా తయారు చేసిన డిపి ని నేను పెట్టుకొని ఆనందిస్తుంటే చాలామంది దాన్ని దొంగతనంగా స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళు వాడుకున్నారు ఇప్పటికీ మా చుట్టాలు బంధువులు అందరూ కూడా అదే నేను అని అనుకుంటూ వాళ్లకి మెసేజ్లు పెట్టి నీలాగే తిట్లు తింటున్నారు.

నాకోసం నువ్వు ప్రేమగా చేసిన డిపి ఇలా అందరూ వాడడం నాకు నచ్చలేదు ఇది దొంగతనం అని ఎంత అన్నా తడిపి మీరు ఎలా వాడతారు అని అంటే వాళ్ళు, తిరిగి నీ ఒక్కదానిదే ఉన్న అంటూ నాకే రివర్స్ అవుతున్నారు అందువల్ల నేను నా డిపి ని మార్చేసి ఒక దేవత ఫోటో లాగా పెట్టుకున్నాను అంటూ తన బాధనంతా వెళ్లగొట్టింది దీపిక.

దానికి భవ్య అవును నిజమే మనం ఎంతో ఇష్టంగా పెట్టుకున్న డిపి నీ ఎవరో వేరే వాళ్ళు పెట్టుకుంటే ఎంతో కోపం వస్తుంది కానీ మనం ఏమీ చేయలేం ఏమీ అనలేం కూడా ఎందుకంటే ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయి రకరకాల ఫోటోలు దొరుకుతున్నాయి ఇది మాది అని మనం ఎవరిని అడగలేము గట్టిగా ప్రశ్నించలేము.

అలా అడిగితే వాళ్ళు దానికి తగినట్లుగా ఇంకొక పిక్ చూపించి మీరే లేరు ఇదిగో ఇక్కడి నుంచి మేము తీసుకున్నామని చూపిస్తారు. అందుకే ఎవర్ని ఏమీ అనకుండా ఉండడమే మంచిది అంటూ దీర్ఘంగా నిట్టర్చింది భవ్య.

దానికి దీపిక అవును భవ్య మనమేమీ చేయలేం అందుకే నేను నా డిపి మార్చుకున్నాను ఇప్పుడు నాకు ఏ తలనొప్పులు లేవు. డీపీ పోయిందన్న బాధ తప్ప ఈ అమ్మవారి ఫోటో పెట్టుకున్నప్పటినుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది నా మిత్రురాళ్లతో ముఖ్యంగా నీతో ఇన్నాళ్లకు నువ్వు కలవడం మనం మాట్లాడుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.

పోనీలే వాళ్ళయినా వాళ్ళ డిపి ని చూసుకొని సంతోషిస్తారు ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మనం ఇలా కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంతకీ మనం ఎప్పుడు కలుద్దాం అంటూ అడిగింది భవ్యని దీపిక. నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను రెడీ అంది భవ్య కూడా నవ్వుతూ ఇద్దరి మనసులు తేలిక అయ్యాయి. ఫ్రెండ్షిప్ డే రోజు పాత ఫ్రెండ్ మళ్ళీ కలవడం ఎవరికైనా సంతోషమే కదా.

ఈ కథ కేవలం డిపిల గురించే కాక డీపీలు దొంగతనం చేసి వారే చేసిన వారి గురించి కాక ఫ్రెండ్షిప్ గురించి కూడా, స్నేహం గొప్పతనం స్నేహితుల గొప్పతనం స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే స్నేహితులకు స్నేహితురాళ్లకు నా ఈ కథ అంకితం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్. అందరికీ నిజమైన స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అవసరానికి వాడుకొని వదిలేసే స్నేహితులకన్నా అవసరమైతే ప్రాణం ఇచ్చే ఒక్క మిత్రుడు ఉన్న చాలు.

– భవ్య చారు

Related Posts