దురాశ

దురాశ

కష్టపడకుండానే కలిమి చేతికందాలని
పక్క వాని పనులు చూసి ముక్కున వేలేసుకుంటి
అనుమతులు లేని సరుకు లెందరికో అమ్మినాడు
గుట్టు రట్టు గాకుండా కోట్లు కూడబెట్టనాడు

ఎన్ని పనులు చేసినా ఎవ్వరికీ దొరకడాయె
అవే పనులు నేను చేసి ఎదగాలని అనుకున్నా
తప్పు పనులు చేసి దొరికి చిప్ప కూడు తింటున్నా
కూలినాలి జేసి కొంత డబ్బు
కూడబెట్టుకుంటి
ఉన్న డబ్బు వడ్డికిచ్చి అసలు రాక ఆరిపోతి
కష్టపడకుండానే కలిమి చేతికందాలని
కల్తిపాల వ్యాపారం కలిసి వచ్చుననుకుంటి
కల్తిపాలు తాగినోడు డబ్బులన్ని ఎగగొట్టె
పైసమీద ఆశతోటి ఉన్నది పోగొట్టుకుంటి
కల్తీసరుకమ్మగా కానిస్టేబులు పట్టే
నకిలీ నోట్ల దంద ఆదాయమనుకుంటి
గంజాయి పండిస్తే గుంజీలు తీయించె
నాటు సారా పెడితే డ్రమ్ములన్ని పగులగొట్టె
కాని పనులు చేశానని కారాగారానబెట్టె
ఎండామావుల్లో ఏరున్న దనుకుంటి
కుండలోని నీళ్ళన్నీ ఒలుకబోసుకుంటినీ
అన్యాయపు పనులు చేస్తెఇలాఆరిపోతానని
కష్టపడ్డ సొమ్మే మనకడుపు నింపునని
ఆలస్యంగా తెలుసు కుంటి ఆశలన్ని అణచుకుంటి
తప్పు పనులు చేయనని చెంపలు వాయించుకుంటి

– కోట

Related Posts