ఎద గాయాలు

ఎదగాయాలు

ఎదగాయాలు

చుట్టo లా వచ్చావు , చవులూరించావు
చల్లని నీ చూపుల బాణాలు వేస్తూ సూది లా గుచ్చావు
మాటలెన్నో చెప్పావు, మంత్రాల మాటలు చెప్పి ,చేతి లోనే
స్వర్గం చూపించావు, మరో ప్రపంచం చూపించావు ఆశలెన్నోరేపావు ,

అందాలు నీలో కూడా ఉన్నాయని చూపుతూ,

మధురమైన అనుభూతినిచ్చావు,మరలి
వస్తానంటూ ఎన్నో బాసలు చేసి పోయావు,
అదిగో,ఇదిగో అంటూ కాలంతో పాటు నువ్వు

మారిపోయావు నన్నుమరచి పోయావు ,

గుర్తు చేయబోతే హృదయం మోయలేని మాటలేన్నో గుండెల్లో గుచ్ఛావు,
ఎద గాయం చేసి మరలి పోయావు ,మాటల తూటాలతో
మనసు చిధ్రం చేసావు, మాపాటెలా మబ్బు కమ్మెసిన
మానని గాయం రేపావు….

-భవ్య చారు

అమావాస్య చంద్రుల్లు Previous post అమావాస్య చంద్రుల్లు
అధికులు Next post  అధికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close