ఏడడుగుల బంధం

ఏడడుగుల బంధం

ఎన్ని జన్మల బంధమో ఈ
ఏడడుగులబంధంఅంటారు పెద్దలు!

ఆ బంధానికి కావాలి
ఇద్దరి మనసుల కలయిక
ఏడడుగుల అందం

జీవితాంతం కలిసి మెలిసి
నడవటానికి విప్పలేనిముడి
ఏడడుగుల ముహూర్తం

ఒకరికి ఒకరు రక్షణ కవచంలా రాణించేది
ఏడడుగుల గొప్పతనం

కష్టం సుఖం ఏదైనా కలిసే
నడవాలని చెప్పేది
ఏడడుగుల సంద్రం

భరించే భాద్యతలు
భావాల రూపం కోసం
కట్టుకున్న కలల గోడ
ఏడడుగుల కోటగోడ

నమ్మకాల తెరలు
అల్లుకునే ఆశలు
ఏడడుగుల వలయం

ఆలుమొగలఅనుబంధానికి
సమాజపు కట్టుబాట్ల కల్పన ఏడడుగుల పీటముడి

దాంపత్య జీవితం
అన్యోన్యంగాఆదర్శవంతంగా మారాలని అంతతరార్థం
ఏడడుగుల ప్రతిజ్ఞ

అగ్నిసాక్షిగా ఆహ్వానితుల
ఆశీర్వాదాలతో సాంప్రదాయాల సందడితో
రెండు జీవితాల నిండైన
వివాహ జీవితానికి నాంది
అదేఏడడుగులఆంతర్యం!

– జి జయ

Related Posts