ఎదురు చూపు

ఎదురు చూపు

నిర్మల నిశీది వ్యాపించుసమయాన
నిఖిల లోకమెల్ల
నిద్రించు సమయాన
మా గుడిసెల్లో
మా శయణంలో
మా స్వప్నంలో

కొడుకు రాకకై ఒక పేద తల్లి ఎదురు చూపు
చెమట పట్టిన శరీరంతో
కందిన కండరాలతో
ఇల్లు చేరే భర్త కై
ఇల్లాలి ఎదురుచూపు
శ్రమ చేసే శ్రామికుడు
నెలమొదలుకై ఎదరు చూపు
కూలి చేసే కార్మికుడు
కష్ట ఫలానికై ఎదురు చూపు
వయసు మళ్ళిన ముసలివాడు
ఫించనికై ఎదురు చూపు
బ్రతుకు మీద ఆశ చచ్చి
చావుకోసం ఎదురు చూపు
మా పనకలు పంచల నుండి
మెత్తటి పరుపులకు చేరుతాయేమో అని
మా కడుపు మంటకు
చూసి మా కుండ మూడు పూటలా ఉడుకుతుందేమో అని ఎదురు చూపు
మూడు పూట్ల కాకపోయినా
రెండు పూట్ల నాలుగు వేళ్ళు
నోట్లోకి పోకపోతాయా అని ఎదురు చూపు
మా కారే పాకలు
కప్పుకునేం దుకు మబ్బులకై
ఆకాశానికి మా ఎదురు చూపు
మా పళ్లెం లో పరమన్నానికి
మా ఎదురు చూపు
మా పంచల స్థానం లో పక్కా ఇళ్లకై మా ఎదురు చూపు
ప్రభుత్వ పథకాలు ఒక్కసారైనా
మమ్ము పలకరించక పోతాయా
అని ఎదురు చూపు
మా బ్రతుకంతా ఎదురు చూపు
చచ్చాక
మా పాడి మోసే పరమాత్ములకై
ఎదురుచూపు

– అభినవ శ్రీ శ్రీ

Related Posts