ఎదురు చూపులు

ఎదురు చూపులు

1)ఉన్నత చదువులకు ఉద్యోగమొచ్చునని
బాధలు పడి చదివి భంగపడిరి
ఏడువత్సరాలు ఎదురు చూపులెగాని
కోర్కె తీరదాయె కొలువు రాక

2) చూపు కన్న ఎదురు చూపులు కష్టమౌ
బంధు జనమును కన భారమగును
ఎదురు చూపులంటె ఎంత చిత్రమొగద
ఆశ భంగమగును అప్పు డపుడు

3)ఎండకాలమాయె ఏ సీ లు లేవాయె
ఉక్కపోత పెరిగి చొక్క తడిసె
చల్లగాలి లేక వల్లగాదని యెంచి
విసన కర్ర చేత విసురుటాయె

– కోట

Related Posts