ఎదురుచూపు

ఎదురుచూపు

వస్తున్నావా నువ్వు..?
ప్రియమారా నువ్వు నా దరికి చేరే.. అపూర్వ క్షణం కోసం..
తరతరాలుగా, యుగయుగాలుగా..
కొడగట్టుకు పోతున్న ఆశలకు…
కొత్త ఊపిరిలు అద్దుతూ…
వేచి చూస్తున్న నాకోసం…
ఆధిపత్యపు భావజాల నిగలాలను చేదించుకొని..
ఆర్తిగా హత్తుకోవడం కోసం..
ఇకనైనా వస్తున్నావా నువ్వు..?

అర్ధాలు:

నిగలాలు: సంకెళ్లు.
ప్రియమారా: ప్రేమగా..

– మామిడాల శైలజ

Related Posts