ఎదురుచూపు

ఎదురుచూపు

ఎదురు వచ్చిన అదృష్టానికి
కాలం కలిసి వ స్తే

మనసు భారమంతా
మాయం కాదా

కాయలు కాసిన కన్నులకు
తెలియని భావం తెర తీస్తే

ఆరాట పు హృదయ స్పందన ఎదురుచూపు

పసిబిడ్డ ల జాలిచూపు
అమ్మ కోసం ఎదురుచూపు

బడి గంటల మోత కోసం
విద్యార్థుల ఎదురుచూపు

కుశల ప్రశ్నలు అడిగే
స్నేహితుడి కోసం ఎదురుచూపు

స్వాతి చినుకుల ఆశ కోసం
సంద్రం ఎదురుచూపు

నవ యవ్వన ప్రియురాలి
కోసం ప్రియుడి ఎదురుచూపు

మనసు విప్పి న మాట కోసం
భార్య ఎదురుచూపు

పెరిగే వయస్సు పెను పెనుభారమైతే
పిల్లల కోసం ఎదురుచూపు

సమాజపు చైతన్యంకోసం
మేధావుల ఎదురుచూపు

భరతమాత తన ముద్దు
బిడ్డల కోసం ఎప్పుడూ

ఎదురు చూపే కదా !

– జి జయ

Related Posts