ఎదురుచూపులు

ఎదురుచూపులు

ఏందే నువ్వు? వాడేమైనా నీ సొంత మొగుడా? అంతలా గింజు కుంటున్నావు. పోతే పోయాడు వదిలెయ్యి, వాడి గురించి ఆలోచించకు. ఒక వేళ వాడే కావాలనుకుంటే వెళ్ళు, మేమేమీ ఇక్కడే ఉండమని అనడం లేదు. నువ్వు ఇక్కడ ఉంటే మాకే నష్టం కానీ, లాభం ఏమి లేదు పోయవనుకో ,నీ కొడుక్కు తల్లి లేకుండా పోతుంది. మరి మేమేం నిన్ను ఆగవడత లేము.

Girl, Snow, Winter, Waiting, Cold, people, season, white, street, lamp | Pxfuel

నీ ఇష్టం బిడ్డా, నీ కొడుక్కు తండ్రి లేడు ఇప్పుడు తల్లి కూడా చస్తే వాడు అనాథ అవుతాడు. మరి నీ ఇష్టం అసలే, మొదటి వాడితో అష్టకష్టాలు పడి ఇన్ని రోజులు ఒంటరిగానే ఉన్నావు. ఇప్పుడి సంబంధం వచ్చిందని చేస్తే మంచిగా ఉంటాడు అని అనుకుంటే వాడు ఇంకొక దాన్ని తెచ్చి ఇంట్లోనే పెట్టి దాంతో నిన్ను తిట్టించాడు అంటేనే అర్దం అవుతుంది, వాళ్ళకు ముందు నుండే సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే, ఇరవై అయిదు వందలకు  ఎవడన్నా కిరాయికి ఉంచుకుంటాడా నీకు అనుమానం వచ్చింది కాబట్టి అడిగేసరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు.

అయినా మాకు బుద్ది ఉండాలి వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా చేసాం. నాన్న ఉంటే అన్ని తెలుసుకునే వాడు అయ్య లేక పిల్లలను పంపితే మంచి వాడే అని అన్నారు. వాళ్లకు ఏం తెలుసు ముందు కనిపించేదే నిజం అని అనుకున్నారు నువ్వైనా కాస్త ఆలోచించక ఎవరో ఏదో అన్నారు అని తమ్ముళ్లకు పెళ్ళిళ్ళు కావు అని చేసుకుంటా వెళ్ళి పోతా అని ఎగిరి చేసుకుని ఇప్పుడు బొందలో పడ్డావు.

నాలుగేళ్లు నరకం చూపించాడు వాడి నీ చేసుకున్న రోజు నుండి దవాఖాన లు అంటూ తిరగడానికి సరిపోయింది ఓసారి అబార్షన్ అని ఓసారి ఆపరేషన్ అని ఓసారి రక్తం తక్కువ గా ఉందని ఏదేదో మయ చేశాడు అసలు నాకు తెలియక అడుగుతాను.

ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా ఎంత లావుగా ఉండేదానివి ఒక్క సారి అయినా హాస్పిటల్ కు పోయినవా ఒక్క రోజన్నా జ్వరం అన్నవా అలాంటిది అక్కడ ఉండగా గంటకో గోలి వేసుకునేలా చేశాడు పిచ్చి మోహనివి నీకు అర్దం కాక అబ్బో నా మొగుడు నాకు గోళీలు తెచ్చాడు అని పొంగి పోయావు ఇప్పుడు అర్దం అయ్యింది కదా ఇక వాడి గురించి మర్చిపో ఆ మామిడి పండులో ఏం కలిపాడో అందుకే వెళ్ళిపోయాడు.

Waiting... | He sat there, resting his back against his bag,… | Flickr

వాడి తప్పు లేకుంటే పెళ్ళానికి ఇలా అయ్యిందని తెలిసి హాస్పిటల్ లో ఉందని తెలిసిన వాడు ఎవడైనా యాత్రలకు పోతాడా రాకుండా ఉంటాడా పెళ్ళాం అంటే కోపం ఉన్నవాడు అయినా సమాజానికి భయపడి అయినా రావాలి కదా అది కూడా కాలేదు రాలేదు అంటే వాడు కావాలనే నిన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేసి ఇట్లా చేశాడు నువ్వు వాడి కోసం పూజలు వ్రతాలు అంటూ ఉపవాసాలు చేస్తే వాడు వస్తాడా ?  ఎంటి ? ఖర్మ నువ్వు ఆ ఆలోచన మానుకో ,వచ్చేది ఉంటే ఎప్పుడో నా పెళ్ళాం అని వచ్చేవాడు.

హాస్పిటల్ లో పట్టుకునే ఉండేవాడు తెల్సా అని అంటున్న అమ్మ మాటలకూ అడ్డు వస్తూ….

నేను అమ్మా పాపం ఆయన కు ఏమీ తెలియదు వాళ్ళు అతన్ని ఏదో మాయ చేశారో లేదో బెదిరించారోనే అందుకే వాళ్లను పట్టుకుని ఉన్నాడు రాలేక పోతున్నాడు నా సొంత మొగుడా అంటున్నావు పెళ్లి అయ్యాక మొగుడే కదా అన్నాను నేను . మొగుడే కానీ రెండో మొగుడు మొదటి మొగుడికి ఉన్నంత ప్రేమ రెండో వాడికి రెండో పెళ్ళాం మీద ఉండదే ఎందుకు అంటున్నాను అంటే మీ నాన్న కు నేను రెండో పెళ్ళాన్ని మీ నాన్న కూడా నాతో ప్రేమగా ఉండేవారు కాదు , నన్ను వదిలించుకుని మొదటి పెళ్ళాం దగ్గరికి వెళ్ళాలి అని చాలా ప్రయత్నం చేశాడు కానీ అది రానివ్వలేదు.

ఎదురుచూపులు

దాంతో ఇకతప్పని స్థితిలో నాతో ఉన్నారు అలా ఉన్నా నన్ను కొట్టేవారు తిట్టేవారు కదా నీకు తెలుసు కదా అంటూ అమ్మ వివరించింది. తిరిగి తానే చూడు బిడ్డా వాళ్ళు ఆయనను బెదిరించారు ప్లాన్ వేశారు అంటున్నావు అతన్ని గ్రిప్ లో పెట్టుకున్నారు అని నువ్వు బాధ పడుతూ ఉన్నావు కానీ నీకు నువ్వే ఏం జరిగింది అనేది మొదటి నుండి ఆలోచించు ఒక సారి వాళ్ళు బెదిరిస్తే బెదిరి పోవడానికి అతను చిన్న పిల్లాడు కాదు .

నలభై యేళ్లు ఉన్న వ్యక్తి ఒక గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్నాడు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆయనకు తెలుసు అని నువ్వే చెప్పావు వాళ్ళు బెదిరిస్తే అతను ఎదిరించ లేడా, అతను సమాధానం చెప్పుకోలేడా ఏం మాటలే నీవి తెలివి లేదు నీకు అసలు బుర్ర ఉందా సరే మొదలు పెళ్లి అయినప్పటి నుండి మాట్లాడుకుందాం సరేనా అంది అమ్మ ,హా సరే అన్నాను నేను ..

పెళ్లి అయ్యి మేము అక్కడ వుండగానే నీతో ఇల్లు కడిగించాడు ఇది నాకు తెలుసు తర్వాత ఏమన్నాడు చెప్పు అనగానే , నేను ఇది నా ఇల్లు అనగానే నీదా కాదు నా ఇల్లు అన్నాడు తర్వాత యాత్రలు అంటూ తీసుకుని వెళ్ళాడు అదొక్కటే మంచి విషయం, ఇక మేము వచ్చాక ఎన్నో సార్లు నువ్వే చెప్పావు ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు మెల్లిగా చప్పుడు కాకుండా వస్తాడు నువ్వు ఏం చేస్తున్నావు అని అంటాడు .

నీ చేతి వంట తినకుండా ఆయనే వంట చేస్తాడు నన్ను ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం గిన్నెలు కడుగడం అని ఇవే చేయిస్తాడు అన్నావు అంటే పని మనుషులు చేసే పనులన్నీ నువ్వు చేస్తే అతను వంట చేసి నీకు ఇంత ముద్ద పారేశాడు అనుకుందాం సరే పోని భార్య అంటే ఇష్టం కాబట్టి అలా చేశాడు అనుకుందాం తర్వాత కడుపొచ్చి అబార్షన్ అయితే దవాఖాన ల నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు .

Free photo Good Morning Sun Light Blue Sky Sea Waiting - Max Pixel

దవాఖాన లో నే నీ మీద మీద పడుతూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటే డాక్టర్ వచ్చి తిట్టే పంపింది అంతా కామ పిశాచి వా అంటూ సిగ్గు పోయింది అయినా కూడా హి హి అంటూ నవ్వుతూ ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు అబార్షన్ అయ్యాక మా ఇంట్లో విడిచి పెట్టీ వెళ్ళిపోయాడు కానీ ఒక్క నాడు అయినా నిన్ను పట్టుకుని ఉన్నాడా మందులు తెచ్చి ఇస్తే చాలా.. పెళ్ళాం తో ఉండాల్సిన అవసరం లేదా ?  అన్ని నేనే చూసుకుంటూ ఉంటి ఒక్క రూపాయి కూడా ఇయ్యక పాయే , ఇగ మళ్లీ అప్పుడే వాళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అప్పటి నుండి ఏం జరిగిందో నువ్వు చెప్పు అంది అమ్మ..

నేను గొంతు సవరించుకుని అప్పటి నుండి వచ్చిన అది నన్ను అక్కా అని పిలిచింది నేను బాగానే మాట్లాడని నా చీరలు ఒక్కొక్కటిగా పోయేవి, దానికి జాకిట్లు కుట్టించాడు అని తెలిసి గొడవ పడ్డాను కానీ అది నిజం కాదని నా నోరు ముయిo చాడు ,కిరాయి వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు ఇరవై అయిదు వందల కిరాయి అని తెలిసి అంతా తక్కువ నా అంటే వాడికి అప్పు ఉన్నాను అని చెప్పాడు.

ఎదురుచూపులు

ఎప్పుడూ నేను చూస్తుండగా కిరాయి ఇవ్వలేదు పిల్లలు గొడవ పడితే అది వచ్చి నాతో గొడవ పడింది నీ మొగుడు వచ్చి చూడలేదు అని అప్పటి నుండి అనుమానం వచ్చింది కానీ వదిలేసా పట్టించుకోలేదు కానీ పోయిన నా చీర దాని కూతురు పెద్ద మనీషి అయినా నాడు కట్టుకోవడం ఫంక్షన్ మొత్తం ఖర్చు నా మొగుడి దే అని తెలవడంతో నాకు అర్దం అయ్యి ఇంట్లోంచి బయటకు వెళ్ళండి ఖాళీ చేయించు అంటే నేను చేయించను వాళ్ళు నాకు కావాలి అని నాతో నా మొగుడు గొడవ పడ్డాడు.

 రోజు వాళ్ళ గురించే మాకు గొడవలు రావడం చివరికి మంచి మాటలు చెప్పి నా తల్లి గారింట్లో నే నన్ను చంపాలి అని ప్లాన్ వేసి నేను తిన్న మామిడి పండు లో మందు కలపడం దాంతో నాకు ఫుడ్ పాయిజన్ కావడం సమయానికి ఆయన లేకుండా పోవడం తమ్ముడు హాస్పిటల్ కు తీసుకుని వెళ్తే పరాయి వాడిలాగా వచ్చి దూరం నుండి చూసి వెళ్లిపోయిన వాడు యాత్రల పేరిట వాడి చెల్లెళ్లు తో వెళ్ళి గుండు కొట్టించు కోవడం ఆ తర్వాత తీసుకుని వెళ్ళడానికి రాకుండా నువ్వే రా అనడం రాక పోతే విడాకులు ఇస్తా ఇంకో పెళ్లి చేసుకుంటాను అనడం ఇవ్వన్నీ జరిగాయి కదా అమ్మా అంటూ వివరించాను .

Royalty-free waiting photos free download | Pxfuel

కదా నిజంగా నువ్వు అంటే ఇష్టం ఉన్న వాడు ఇలా చేయడు నీ కు ఇలా జరగడం చూసి నీతోనే ఉంటూ నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు ఒక వేళ పని ఉన్నా పని చేసుకుని మళ్లీ నీ దగ్గరికే రావాలి వచ్చాడా లేదు కదా , వాడి చెల్లెళ్ళకు కూడా సిగ్గు శరాలు లేవు వదిన దవాఖాన లో ఉంటే వాడిని యాత్రలకు ఎలా తీసుకు పోయారో వీడు వాళ్లకు ఏం చెప్పాడో ఎవరికీ తెలియదు. వాడి గురించి మొదటి నుండి నాకు అనుమానమే ఉంది నీకు వద్దు అని చెప్పినా నా తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అంటూ చేసుకున్నావు.

ఇప్పుడు చూడు మళ్లీ మొదటికే వచ్చింది ఇంకా వాడి గురించి ఎదిరి చూడకు నీ బ్రతుకు ఏదో నువ్వు చూసుకో ఏదైనా జాబ్ వెతుక్కో నీ కొడుకుని బాగా చూసుకుంటూ నువ్వు సంతోషంగా ఉండు, వాడు మొగాడు ఏది చెప్పినా నమ్ముతారు వాడు రాకుండా నువ్వు వెళ్ళావు అంటే నీ బతుకు కుక్క బతుకే అవుతుంది ఇక నీ ఇష్టం అంది అమ్మా..

అమ్మా చెప్పింది అక్షరాలా నిజం నన్ను కాదనుకున్న వాడిని నేను కోరుకోవడం ఏమిటి ఇప్పుడు వాడు ఉంచుకున్న దాన్ని పట్టుకుంటాడు దాని మోజు తీరక వదిలేస్తే ముసలి తనంలో ఎవరు దగ్గరికి రారు వచ్చినా ఉన్న డబ్బు కోసమే వస్తారు నాకు తెలిసి వాడి దగ్గర డబ్బు లేదు ఉన్నవన్నీ అప్పులే అయినా తప్పు చేయడం సహజం పోని నాకు వాడికి గౌరవం కూడా ఇవ్వాలని లేదు.

ఒకవేళ తన తప్పు తెలుసుకుని వచ్చిన రోజు నేను ఒప్పుకుంటానా ? ఏమో నాకు తెలియదు  ? కానీ అంత వరకు నాకీ ఎదిరి చూపులు తప్పవు కానీ నేను బ్రతకాలి అంటే ఏదైనా జాబ్ చేసుకోవాలి రెండేళ్ల నుండి అమ్మ వాళ్లే చూసారు ఇక వారిని కష్టపెట్టకుండా జాబ్ వెతుక్కోవాలి అని ఆలోచిస్తూ బ్యాగ్ తీసుకుని కొత్త జీవితానికి మొదటి అడుగులు వేసాను…

 

-కవితాసింగ్ 

Related Posts