ఈ పరవశం

ఈ పరవశం

మనసు తాకింది ఎక్కడో
కలల తీరాన్ని!

గుప్పెడు గుండెలోని
విప్పిన అంతరంగపు

తడిసి ముద్దయిన పరవశం
వశంకాని ఆనందం

నునువెచ్చని కూనిరాగం
ఆశల సన్నివేశాల కదలిక

నయనానందకర దృశ్యాలు
తన్మయత్వపు తరంగాలు

నింగికేసిన చూచిన వైనం
నాదస్వరమయిన హృదయపు సరాగం

అద్భుతాల హరివిల్లు లో
మునకలేసిన మురిపెం

మంచు ముత్యాల వాన
వెన్నెలమబ్బులుకమ్ముకొనగ

మచిపోయిన మనోగతం

– జి జయ

Related Posts