ఈ ప్రశ్నకు బదులేది?

ఈ ప్రశ్నకు బదులేది?

బాలికా దినోత్సవమంటారు
పసికూనలనీ కూడా చూడకుండా
నెలల పసి పిల్లల పై కన్నేసి
ఆకృత్యాలు చేస్తారు
కండలేని చిన్నారులను కండకావరంతో
కామంతో కళ్ళు మూసుకుపోయి
చెరచి రక్తాలు కారుతున్నా వదలక
గొంతు నులిమి చంపేసి గోతి లో
పాతి పెడతారు.
తొంభై ఏళ్ల ముసలిదైన, పంతొమ్మిది ఏళ్ల పడుచైన
ఇరవై తొమ్మిది ఏళ్ల జవ్వని అయినా,
ముప్పై తొమ్మిదేళ్ళనా, తొమ్మిది నెలల పసిపాపైన
వారి కామాగ్నికి బలై పోవడమే
బాలికా దినోత్సవమా
స్వతంత్రం అంటూ
స్వేచ్ఛ అంటూ
సమాన హక్కులంటూ
అంతరిక్షంలోకి వెళ్తున్న
నవ నాగరిక సమాజంలో నివసిస్తున్న
బృణ హత్యలను, ఆపలేనిది
బాల్యవివాహాలను ఆపలేనిది
పసి పిల్లలపై ఆకృత్యాలను
అదుపు చేయలేనిది
బాలిక దినోత్సవం అంటారా ?
ఈ ప్రశ్నకు బదులేది?

– అర్చన

Related Posts