ఈ వేళ

ఈ వేళ

ఈ..వేళా…నాతో 
పకృతి జత కట్టి
నాతో సహజీవిస్తూ
నాలో మమేకమై
నన్ను తన గాఢ పరిష్వంగనా
కౌగిలిలో అలుముకుంది నాతో
శుభ సాయంత్రమునా ఏవో
ఊసులు కొన్ని చెప్పుకుంటూ
తన వడిలో సేద తీర్చింది
అలా ఊహల్లో తెలుతూ
గగనం వైపు అలా చూస్తున్న నాకు
చల్లని వింజామర గాలులతో
కాస్త నిద్ర పుచ్చింది
స్వప్నంలో పచ్చని చీర కట్టి
నాకు స్వాగతమిచ్చింది
నాకు ఎన్నో మధురానుభూతులు
ఈ వేళా శుభ సాయంత్రాన
మిగిలించింది…!!

శుభ సాయంత్రం మిత్రులారా

– సైదాచారి మండోజు

Related Posts