ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద

చిన్నప్పుడు అమ్మ చేతి ముద్దను తినేవాళ్ళం. ఆ తర్వాత కూడా బడికో కాలేజీకి ఆలస్యంగా వెళ్తున్నప్పుడు అమ్మ మన హడావుడి చూసి అన్నం కలిపి ముద్దలుగా తినిపించేది.

అమ్మ ఏం చేసినా ఎంతో బాగుండేది. అమ్మ చేతిలో ఏదో మాయ ఉండేది. అమ్మ అలా ఎంత పెట్టినా కూడా తింటూనే ఉండేవాళ్ళం.

అది అమ్మ చేతి ముద్ద గొప్పతనం. అమ్మ అన్నం పెడుతూ ఎన్నెన్నో కథలు, కబుర్లు చెప్పేది. బూచాడు వస్తాడని భయపెట్టినా, ఇంకెన్ని కథలు చెప్పినా అదంతా కేవలం బిడ్డ కడుపు నింపడం కోసమే చేసేది.

బొజ్జ నిండిన తర్వాత చివరి ముద్దను మన చుట్టూ తిప్పి బయట పారేసేది. దిష్టి కొట్టకుండా.. ఎవరన్నా మీ బాబు, పాప ముద్దుగా ఉన్నారని అంటే వాళ్ళు వెళ్ళాక బాగా తిట్టుకునేది..

అమ్మ చేతి ముద్ద అమృతం. అమ్మ చిరునవ్వు ఒక శక్తిని ఇస్తుంది. ఎంతో కష్టపడి ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చి పలకరించే అమ్మే మన బలం.

అలాంటి అమ్మను ఈరోజు కొందరు పట్టించుకోకుండా కేవలం తమ స్వార్థం కోసం ఆశ్రమాల్లో వదిలి పెడుతున్నారు. తమ స్వలాభం కోసం కన్న తల్లి చేసిన సేవలకు ఖరీదు కట్టి నెలకు ఇంత అని పంపించడం ఎంత వరకు సమంజసం? 

కన్న తల్లి ప్రేమను, కన్న తల్లి చేసిన సేవలు వెలకట్టలేనివి. అవునంటారా? కాదంటారా? 

మీ అభిప్రాయాన్ని పోస్ట్ ద్వారా తెలియజేయండి….

Related Posts

1 Comment

  1. ఇప్పుడు తల్లిదండ్రులను పట్టించుకునే వారే కరువయ్యారు, అనాథ ఆశ్రమలలో ఎక్కువగా సిటీ కల్చర్ కు అలవాటు పడినపిల్లలే తల్లిదండ్రులను వదిలివేస్తున్నారు, మీ రచన చదివినవారు ఒక్కరైనా మారినా సంతోషం , అభినందనలు.

Comments are closed.