ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం

ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, కొత్త బట్టలు కొనడం, కేక్ తేవడం, మందు, విందు గురించి ఆలోచించడం, లేదా కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కొత్తగా గడపడం లాంటివి ఉంటాయి.

కొత్త సంవత్సరం అనగానే కొందరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మందు మానెయ్యాలి అని, సిగరెట్ మానేయాలి అని, కుటుంబంతో గడపాలి అని, ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

అయితే అన్ని సార్లు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండలేక పోవచ్చు. మందు మానేయాలి అనుకున్న రోజే ఆఫీస్ లో పార్టీ జరగొచ్చు. లేదా ఇంకేదో అవ్వచ్చు.

అప్పుడు తాగకుండా ఉండలేరు. ఇక సిగరెట్ కూడా అంతే ఏవో ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఇంకా కుటుంబంతో గడపాలి అనుకున్నప్పుడు ఏదో టూర్ కి వెళ్లాల్సి వస్తోంది.

ఇలా అనుకున్న వాటిని మనం కొత్త సంవత్సరంలో చేయలేక బాధ పడిపోతూ మళ్లీ కొత్త సంవత్సరం రాగానే మళ్ళీ తీసుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉంటాం.

అలా మీ జీవితం లో ఇప్పటి వరకు అనుకుంటూ వాయిదా వేస్తున్న నిర్ణయాలు ఏమిటి? ఎందువల్ల మీరు వాటిని వాయిదా వేయవలసి వచ్చిందో మతో పంచుకోండి….

“అనుకున్నా కానీ” అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం తెలుపండి

Related Posts

1 Comment

  1. చాలా correct ga chepperu medam nenu చాలా సార్లు ఇది maneddam అని అనుకున్నాను..కానీ కుదరడం లేదు.ఎందుకు maneddam అని అనుకుంటున్నాను అంటే.. నేను చేసేది తప్పు ఇకా మీదట తప్పు చేయకూడదు అని ఆ నిర్ణయం తీసుకుంటాం కానీ కొన్ని మనేస్తం కొన్ని మనలేము కొన్ని పరిస్థితుల వల్ల..

Comments are closed.