ఈర్ష్యా భరిత ప్రేమ

ఈర్ష్యా భరిత ప్రేమ

ఓ, వృక్షమా……!
నీడ నిస్తివని నిక్కు పోమాకే.
నీ నీడనున్నది
నీకు ఎవరో తెల్సుటే?
నా హృదయం ఉండెను
నా పంజరం అందే.
నీ చెంతనున్నది
నా శ్వాసనే!
గాలి ఊపుకి
బరువైన ఎండినాకులు రాలు;
భారమైన పూరేకులు దొర్లు ;
నీ పై చేరిన మంచు బిందువులు
ఆమె ని గుచ్చును కదే..!

నీ దరినున్నది,
నా బాహ్య హృదయమే.
ఆది గాయపడునేమో?
జాగురతే.

– వాసు

Related Posts