ఎక్కడుంది మానవత్వం?

ఎక్కడుంది మానవత్వం

ఎక్కడుంది మానవత్వం?

ఎక్కడుంది మానవత్వం?
ఏమయింది మనుషుల తత్వం?
నేర్చుకుంటున్నారందరూ..
రాక్షసత్వం..
మనుషులందరూ..
రాక్షసులుగా రూపాంతరం..
చెందుతున్నారు..
రాక్షసులందరూ అంతరించి..
దేవతలుగా మారారేమెా!!
కానీ మనుషులే ఆ రాక్షసులను..
తలపిస్తున్నారు..
అలాగని అందరూ కాదుకానీ..
మంచి మనసున్న మనుషులు..
కొందరున్నారు..
అందుకే ఈ భూమాత ఇంకా..
ఓపిక పట్టి చూస్తుంది..
ఇంకా ఇలా కొంచమైనా మంచి..
ప్రపంచం మిగిలి ఉంది..
మనుషుల్లారా! అందరూ..
మంచిగా మారండి..
మానవత్వం ఉందని నిరూపిద్దాం!
నాటి మేటి కాలాన్ని రప్పిద్దాం!!

– ఉమాదేవి ఎర్రం

ప్రేమ పంచితే బాగుంటుంది Previous post ప్రేమ పంచితే బాగుంటుంది
Next post మండుతున్న అగ్నిగోళము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close