ఏమని చెప్పను

ఏమని చెప్పను

ఏమని చెప్పను నీ గురించి
ప్రేమకి కరిగిపోయే అద్భుతానీవి అని చెప్పనా
అమాయకపు చూపూలతో నా మనసు దోచావు అని చెప్పనా

ప్రేమించడం లేదు అని నా గురించి నా భవిష్యత్తు గురించి

ఆలోచిస్తూ నన్నే తలచుకుంటున్నవ్ అని చెప్పనా

రెండు సార్లు తిట్టి విడిపోయినా

ఒక్క మాటతో నన్ను చేరదీశావు అని చెప్పనా

ఏమని చెప్పను నీ గురించి

మనిషి ని నీకు దూరంగా ఉన్న నీ మనసు

నాకు అంకితం ఇచ్చావు అని చెప్పనా

పసి పాపలా నా మీద అలిగినపుడు

నీ ప్రేమలో నిజాయితి గూఱంచి చెప్పనా

ఏమని చెప్పను నీ గురించి

నువ్వు నా అదృష్టా నివి అని చెప్పనా

మనిషి దూరంగా ఉన్న మనసుతో

మాట్లాడుతున్న ని గూఱంచి ఏమని చెప్పను .

అందమైన నీ కళ్ళలో నాపై కనిపించే

అంతు లేని ప్రేమ గురించి చెప్పనా,

మెరుస్తున్న నీ అధరాల పై

విరిసిన నవ్వుల గురించి చెప్పనా ,

అమాయకమైన ,ఏ స్వార్థం లేని

నీ అందమైన మనస్సు గురించి చెప్పనా .

ఎలాంటి భేషజాలు లేకుండా

నీ ప్రతి అడుగును

ప్రతి విషయాన్ని నాతో

పంచుకున్న నీ మంచితనం గురించి చెప్పనా ,

నీ గురించి నాకు చెప్పి నీ బాధ నాతో పంచుకున్నవ్
కానీ నా బాధ నీతో చెప్పుకోలేక పోతున్నా

నీ గురించి నువ్వు చెప్పినప్పుడు

నీ పక్క నేను లేనే అని బాధ నాకు..

నీతో నేను లేనే నీ బాధ లో

పాలు పంచుకొలేక పోతున్నాను అనే బాధ..

నీతో కలిసి నడవాలని,

నీ చేతిలో చేయి వేసి

నేనున్నాను అంటూ చెప్పాలని

నీ ముంగురులు సవరిస్తూ ఎం

దుకే బాధ నేను లేనా అని భరోసా ఇవ్వాలని..

నీ బాధలన్నీ తీర్చకపోయినా

కనీసం నీకు ఓదార్పు ఇవ్వాలని..

ప్రియా ఏమని చెప్పను

నా మనసు పలికే మౌన మాటలు..

ఎన్నని చెప్పను నాలో ఉన్న భావాలు

ఇలా ఎన్నో ఎన్నొన్నో చెప్పాలని ,

నీతో మనసు విప్పి మాట్లాడాలని తహతహలాడే నీ ప్రియమైన నీ సిద్దు…

-సిద్దు పవన్

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *