ఎండమావులు ఎండమావులు

ఎండమావులుఎండమావులు

ఎండమావులుఎండమావులు

ఎండమావులోయ్ ఎండమావులు
ఎండమావులోయ్ ఎండమావులు
ఎడారినే కాకుండా జగతి నిండి పోయిన వోయ్

పాలకుల సుపరిపాలన ఎండమావి

అవసరమైన వారికి ఆసరా దొరకడం ఎండమావి

అర్హత కలవాడే అందలం ఎక్కడం ఎండమావి

ప్రతిభకి పట్టం కట్టడం ఎండమావి

భజన కీర్తనాపరులని చెదర గొట్టడం ఎండమావి

పంట భూములలో వానలే పడడం ఎండమావి

ఖాళీ స్థలాలని పదిలపరచుకోవడం ఎండమావి

అబద్ధాలాడని నిజాయితీపరుడు

బ్రతకి బట్టకట్టడం ఎండమావి

పాలిథిన్ వాడకుండా సామాన్లు తేవడం ఎండమావి

సెల్ఫోన్ చేతులో లేని వారిని చూడడం ఎండమావి

ఏటికేడాది గతుకుల్లేని రోడ్లు ఉండడం ఎండమావి

ఆఫీసు వేళలే కాక శనిఆదివారాలు

ట్రాఫిక్ లేకపోవడం ఎండమావి

హోటళ్ళు ఎన్ని ఉన్నా ఉన్నంతలో

మంచి భోజనం దొరకడం ఎండమావి

మంచి భర్తకు మంచి భార్య దొరకడం

మంచి భార్యకు మంచి భర్తా దొరకడం ఎండమావి

రాస్తే ఉన్నాయి కొల్లేటి చాంతాడన్ని

తక్కువే మక్కువంటారుగా

అందుకే‌ ఈ కొన్ని

 

ఉపద్రష్ట సుబ్బలక్ష్మి

కాలమే సమాధానం చెప్పుతుంది Previous post కాలమే సమాధానం చెప్పుతుంది
మరీచిక Next post మరీచిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close