ఎందుకో చెప్పాలి అనిపించింది-లేఖ

ఎందుకో చెప్పాలి అనిపించింది-లేఖ

లోకం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పనులు లేక, పైశల్ లేక, తినడానికి తిండి లేక, కట్టుకోనీకి బట్టలు లేక మస్తు బాధలు వడుతున్న జనాలున్నరు. గాసుంటి లోకం ల ఇంకొందరు సుతా ఉన్నారు.

ఆల్లే పైసల కోసం పానాలు తిసేటోల్లు, సిన్న పిల్లలను మదమెక్కి కరాబు చేసేటోళ్ళు… పది రూపాల కోసరం పట్టపగలే హత్యలు సేసేటోళ్లు ఉన్నారు. గా పైసల కోసం గడ్డీ గాదం తింటూ లచ్చలు, కోట్లు సంపాదించుకునే టోళ్ళు ఉన్నారు. ఆళ్ళకి సూత సంపితే ఒక బాధ సంపకుంటే ఇంకో బాధ. తింటే ఒక బాధ తినకుంటే ఇంకో బాధ.

రోగాలు, రోష్టులు, టానిక్కులు, మందులు, మంచింగులు, బిర్యానీ ముక్కలు ఒక దిక్కు అయితే, మురికి గుంటలు, గుట్కాలు, తెల్లచీరలు, మల్లే పూలు, బేర్ మంటున్న పోరల్లు…

పాలకు గతి లేక నీళ్ళు రాక కన్నీళ్ళే మింగుతూ, గింత కండ కూడా కానరాని ఏముకల గుడులు ఎన్నో, ఇగో గివ్వన్ని సమస్యలు సూట్టు సూతున్నా, గవేవి కండ్లాళ్ళ కనిపియ్యక పోరల్లు మస్తు కొట్టుకుంటారు. గా పోరి నాది అని అనుకున్నాక చెప్పనీకిరాక, చెప్పలేక, చెప్పే ధైర్యం లేక అది ఇంకెవర్నో సూసుకుందని బాధలు వడి పిచ్చోని లెక్క పానాలు తిసుకునుడు ఏందిరా భై…

ఇంకొల్లు ఉంటారు. ఆ పిల్ల నాది అనుకున్న వోలె దాని సుట్టు తిరుగుతూ, ఓ పిల్ల నువ్వు ఇంకొన్ని సుసుకుంటే నిన్ను సంపుతా అంటూ యాసిడ్ వోస్తూ, లేదా నాకు దక్కనిది ఎవనికి దక్కొద్దు అనుకుంటా పాణాలు తీసి జైల్ పాలైతే ఏమొస్తది తమ్మీ.

గందుకే గి ప్రేమ గిమా జంతా నై! పుట్టినమా కన్నోల్లను కష్ట పెట్టకుండా కాపడుకున్నమా, కడుపు నిండా గింత తిండి వెట్టినమా, కన్నీళ్లు రాకుండా సూసుకుంటే మస్తు సాల్ గీ జిందగీ…

ఇగో తమ్ముళ్ళు మంచిగా ఇనుండ్రి గీ ప్రేమ మంచిది కాదురా బై సంపుతది లేదా సస్తది. గందుకే ప్రేమ అద్దు రా, కానీ ప్రేమ కావాలే గది కన్నీళ్ళ కడుపుల వుట్టిననొల్ల మీన సూపండి. ఇగో ఏదో సెప్పలి అనిపించింది సెప్పిన మల్ల ఏం అనుకోకుండ్రి మల్ల ఉంటా మల్ల

– మీ భవ్యక్క (భవ్య చారు)

Related Posts