ఎంతహాయిగుందే

ఎంతహాయిగుందే

నాకళ్ళు ఎపుడు నిను చూసాయోగానీ
నీ ఆహార్యం చూసి ఆహారమెక్కకుందే

నా ముందు ఎపుడూ ఎవరో వస్తుంటే
అది నువ్వేనేమో అని అనిపిస్తుఉందే. …..(పల్లవి)

అదిగో మరి నువ్వలా నవ్వేస్తూవుంటే
నాకుతెలియకుండా నా పెదవి నవ్వుతోందే……..(అను పల్లవి)

ఎంతహాయిగుందే ఎంతహాయిగుందే
నానువ్వు నవ్వుతుంటే ఎంతతీయగుందే

పచ్చగడ్డినాకు పట్టుపరుపయిందే. ……(చరణం 1)
నువ్వుపక్కనుంటే నేనెక్కడుంటే ఏంటే

నీ ఒడే తలగడయ్యే నీ కురులు జోలపాడె
నీ తలపె తలను పుడితే నిదురపట్టకుందే

తీరాన వేచి ఉన్నా తీరికగా నీకై
తీరా నువ్వొచ్చాక తీరు మారుతోందే

ఎంతహాయిగుందే ఎంతహాయిగుందే
నా తీరు మారుతుంటే ఎంతతీయగుందే

జాగు చేసె నేనే ఓ జాణ కొరకు నేడే. …..(చరణం 2)
జాలీగా ఉన్న గుండె జాలిగుండె అయిందే

జాజివంటి నన్ను జాబిలంటి నిన్ను
ఆ భూమీ ఆకాశం వేరుచేయలేవే

మదన పడిన మనసే మనసు పడెను నీపై
నీ మత్తులోన పడితే గమ్మత్తుగానె ఉందే

ఎంతహాయిగుందే ఎంతహాయిగుందే
నీ మత్తులోన పడితే ఎంతతీయగుందే
ఎంతహాయిగుందే ఎంతహాయిగుందే
మనమొక్కటయ్యినాక రెండోదేమివుందే

– బృందావనం సత్యసాయి

Related Posts