ఎత్తుకు పై ఎత్తు

ఎత్తుకు పై ఎత్తు

ఎత్తుకు పై ఎత్తు

2010 సం. మా కాకినాడలో నేను చూసిన ఒక సంఘటన ఇప్పటికీ తలుచుకుంటే నవ్వొస్తుంది.

కధ ఏంటంటే కాకినాడ ఆర్టీసి బస్టాండు దగ్గరలో ఒక భోజన హోటల్ ఉండేది. ఆ హోటల్ ఓనర్ బాగా పిసినారి & కక్కుర్తి లక్షణాలు కలవాడు ఎంత అంటే తన హోటల్ లోని తినుబండారాలు కూడా నాణ్యమైన & రుచికరమైనవి పెట్టే వాడు కాదు.

అందుకే తొలిసారి వచ్చిన కష్టమర్లు మళ్లీసారి వచ్చేవారు కాదు (కొన్నిసార్లు వేరే గత్యంతరం లేక వెళ్ళడం తప్ప). కాని పక్కనే ఆర్టీసి బస్టాండ్, రైల్వేస్టేషన్, చిన్న చిన్న బజార్లు ఉండటం & తన హోటల్ కి కిలోమీటర్ దూరం వరకూ వేరే హోటల్ లేకపోవడం అన్నీ కలిసి వ్యాపారానికి మంచి ప్రదేశం మూలంగా హోటల్ ఎప్పుడూ రద్దీగా ఉండేది.

మంచిగా సంపాదించేవాడు. ఐతే తన హోటల్ కి ఒక పాల వ్యాపారి హోటల్ పెట్టినప్పటి నుంచీ పాలు పోసేవాడు చాలా కాలంగా తన దగ్గరే పాలు కొంటున్నాడనే అభిమానంతో తక్కువ ధరకే పాలు పోసేవాడు అయినా సరే లీటరు పాలకి ఏది 2010 కాలం నాడు లీటరు పాలు ₹35-40/- ఉండే కాలంలో కేవలం ₹12/- మాత్రమే ఇచ్చేవాడు.

సంవత్సరాల తరబడి పాలు పోస్తున్నా సరే రేటు పెంచమని ఎన్ని సార్లు అడిగినా పెంచేవాడు కాదు (పైగా అతనే పాలు పోసి అతనే చల్లార్చి అతనే తోడు పెట్టేవాడు తను పోసిన పాలని అది హోటల్ ఓనర్ పెట్టిన రూల్ ఇదంతా పోటీ వ్యాపారంలో తప్పదనుకుని చేసేవాడు ఆ పాల వ్యాపారి).

ఇలా ఐతే ఇంక కుదరదని ఆ హోటల్ ఓనర్ తిక్క కుదర్చాలని పాలలో నీళ్లు ఎక్కువ కలిపి అదే లీటరు ₹12/- కి పాలు పోయడం కొనసాగించాడు ఆ పాల వ్యాపారి. ఈ తంతు ఇలా కొంతకాలం సాగాక హోటల్ కి వచ్చిన కష్టమర్లు ఈసారి నుంచి తినే కూరలే కాకుండా పెరుగు కూడా పల్చగా ఉందని చెప్పడం మొదలెట్టారు.

హోటల్ ఓనర్ తో దాంతో ఒకరోజు ఆ పాల వ్యాపారి హోటల్లో తను పోసిన పాలు మరగ పెడుతుండగా హోటల్ ఓనర్ పని కుర్రాడ్ని పిలిచి “ఒరేయ్ సురేషు పెరుగు ఎలా ఉందో ఒకసారి ఆ పాలోడికి చూపించరా” అని అన్నాడు చెప్పినట్టే ఆ పని కుర్రాడు పెరుగు తీసుకెళ్లి “ఏవండి సూరి గారు మా ఓనరు పెరుగు పట్టుకెళ్లి మీకు చూపించమన్నాడండి” అన్నాడు.

దానికి ఆ పాల వ్యాపారి “చూసేనని చెప్పు” అన్నాడు ఆ పని కుర్రాడితో తను అదే సమాధానం “సూరి గారు చూసానని చెప్పమన్నారండి” అన్నాడు హోటల్ ఓనర్ తో దెబ్బకు షాక్ ఐన హోటల్ ఓనర్ పక్కన ఉన్న ఒక పెద్దాయనతో “ఏవండీ పెరుగు పల్చగా ఉందని పట్టుకెళ్లి చూపించమంటే చూసేనని చెప్పమన్నడం ఏంటండీ”

అని ఆశ్చర్యకరమైన ముఖం పెట్టాడు. మేటర్ మళ్లీ ఆ పాల వ్యాపారితో నేరుగా అడగ్గా “బయట లీటర్ ₹40 ఉన్న పాలు నువ్వు ₹12 కి పోయించుకుంటూ మళ్లీ క్వాలిటీ బాలేదంటావా నీకు సిగ్గేయడం లేదా” అని ఘాటుగా సమాధానం చెప్పాడు పాల వ్యాపారి మరోసారి షాకైన హోటల్ ఓనర్ ఇంక మేటర్ పెద్దది చేస్తే తన పరువు పోతుందని దెబ్బకు సైలెంట్ ఐపోయాడు.

 

-ప్రదీప్

అద్భుత అంతర్జాలం Previous post అద్భుత అంతర్జాలం
కంప్యూటర్ యుగం Next post కంప్యూటర్ యుగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close