ఎవరికోసం
చెట్టు బతికింది ఎవరికోసం
పొయ్యిలోకి కట్టెలు ఇస్తుంది
సి ఓటు తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది
కొయ్య బొమ్మలు తయారు చేస్తుంది
చెట్టు లేకపోతే లేదు మనుగడ
ఆవు బ్రతికింది ఎవరికోసం
పరుల కోసం
ప్రజల కోసం
పాలుస్తుంది ఆవు
నెయ్యి ఇస్తుంది ఆవు
కల్లాపు చల్లిఎందుకు పేడనిస్తుంది
ఇది చూసి నేర్చుకో మిత్రమా!
పరల కొరకు చెట్టు ప్రాణం వదులుతుంది
ఆవు చర్మం చెప్పులు కొట్టడానికి దాసోహం అవుతుంది
సజ్జనులు వలే కీర్తి
దుర్జనుల బ్రతికిన ఏమి బతుకు
అది ఒక బతుకేనా
కుక్కల వలే
నక్కల వలె
పందుల వలె
రాబందుల వలె
బతుకు బతుకు
ఒక బతుకేనా
గుండె మీద చేయి వేసుకుని బతుకు
నిజం మాట ప్రమాణం చేసి నడుపు
ఒంట్లో నిజం
కంట్లో క్షేమం
ఎవరికోసం అని గడుపు
పరల కొరకు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను
మనిషి జన్మకు సార్ధకం చేసుకోవలెను
ఎవరికోసం అంటే మనకోసం కాదు
పొరుగువారు కోసం పాటుపడు నీ కొరకు నీ కుటుంబం కొరకు పాటుపడు
ఏసుక్రీస్తు లాగా బతుకు
బుద్ధుని వలె బ్రతుకు
శ్రీరాముల బ్రతుకు
మనిషి జన్మకు ప్రాధాన్యత ఇవ్వు..!
-యడ్ల శ్రీనివాసరావు