ఎవరు నీవు

ఎవరు నీవు

గొప్పగొప్ప ఆదర్శాలు…

గోప్పోళ్ళ  కోసం గప్పాలు పలుకుతూ…
నాలుగు మాటలు నేర్చి…
నలుగురు మధ్యలో మాటల మూటలతో…
ఊకదంపుడు ఉపన్యాసాలతో…
తోటి వారిని సాటివారిని….
దోచుకుంటూ.. దాచుకుంటూ….
స్వార్థపూరిత భావంతో…
సమతా భావాన్ని సమాధిచేస్తూ…
అసమానతలకు ఆజ్యం పోస్తూ…
మేకవన్నే పులిలా మారిన నీవు…
సంఘజీవివా..?… సంఘద్రోహివా..?
– అంకుష్

Related Posts