ఎవరిని నమ్మకూడదు
లోకం తెలియని చిన్నపిల్ల
ఆటలు ఆడుకోవడానికి ఇంటి నుంచి
బయటకు వెళ్ళింది…
చాలా ఆలస్యం అవుతుంది తను ఇంకా రాలేదు..
కొంచం కంగారుగా నేను అటు ఇటు తిరుగుతూ
టైం చూస్తూనేమో నాకు కంగారు ఎక్కువ అవుతుంది..
చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళందరిని అడిగిన
మాకు తెలియదు అని చెప్పారు…
కొద్ది సమయంలో నా స్నేహితురాలతో తను కలిసి
రావడం చూసి నా ప్రాణం లేచి వచ్చింది..
నేను ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఆడుకోవడానికి
దూరంగా వెళ్ళదు..
నన్ను క్షమించు అమ్మ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను..
తను ఆడుకుంటూ ఎవరో ఒక అతనుతో వెళ్లడం
మా చెల్లి చూసి నాకు చెప్పింది..
లైంగిక దాడి చేయాలని ప్రయత్నం చేసే లోపే
చుట్టూ ప్రక్కల ఉన్న జనం మేలుకున్నారు..
తనకి అర్థమయ్యేలా చెప్పాలి కానీ కోపంతో చెప్పకూడదు..
ఎవరి మాటలు నమ్మకూడదు..
ఇకనుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది
తన కూతురికి…
- మాధవి కాళ్ల