గాలి నిచ్చెనలు!!

గాలి నిచ్చెనలు!!

ఆశ అంబరాన్ని అంటే,
అక్షి రెప్పలాయెను,
పక్షి రెక్కల తీరు.

పద్దు లేని గమ్యం,
నీ హద్దు గ మారే.
నింగిని చేర
నీ రెప్పలు అల్లాడెను
టప…… టపా!

మబ్బులను మోయ
నీ నెత్తి పై,
సమాంతర నడకలను ఆపి,
గాలి నిచ్చెనలు
ఎక్కుతుంటివి నిటారుగా.

గగనానికి ఏగిన
నీ ఆశలు తీర
ఎగబ్రాకిన నీ యత్నాలు
అటకను చేర్చి నిచ్చెను
నీకు సాఫల్యత!!

– వాసు

Related Posts