గాలిలో దీపం

గాలిలో దీపం

ఒక సారి.. మా ఊర్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చాటింపు వేయించారు.. అదే రోజు మా అమ్మ ఏదో ఎవరో చెప్పిన ప్రవచనాలు వింటు ఉంది… టీవీ లో… వారు అన్నారు, నీకు దేవుడి మీద భక్తి ఉంటే, నిన్ను దేవుడు కరుణిస్తాడు. నీలో నిజాయితీ ఉంటే.. ఏదైనా నిన్ను వదిలిపోదు.. నువ్వు నమ్మిన దైవం నిన్ను విడవడు అని.. కానీ దానికి మనం చేయాల్సింది మనం చేయాలి.. అంటే ఏదైనా మనం చేసే మంచిలో ఉంటుంది అని..

ఇది విన్న మా అమ్మ చెవిలో ఆ చాటింపు పడింది… అవును నిజంగా.. ఆయన చెప్పింది నిజమేనా అని ఆలోచిస్తూ… గదికి తాళం వేయకుండా, బయటికి వెళ్ళింది. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని అనుకుంటూ…

తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు మాయమయ్యాయి.. ఖాలీగా ఉన్న బీరువాని చూసిన అమ్మ షాక్.. ఎంటి ఇలా జరిగింది అని… ఎం అర్దం కాలేదు. అటుగా గురువు గారు వెళుతున్నారు..

అయ్యా అయ్యా.. నిన్న నేను ఒక ప్రవచనం విన్నాను.. ఇలా జరిగింది అని ఇదంతా విన్న గురువు గారు …

అమ్మా.. నువు విన్నదే.. ఆ దొంగ కూడా వినే ఉంటారు కదా… నేను చేసే పనికి తోడుగా ఉండు అని కోరుకుని ఉంటాడు కదా…

అయినా నువు విశ్వాసం ఉంచిన దానివి.. జాగ్రత్త పడాలి కదా… దొంగలించడం అతని వృత్తి జాగ్రత్త పడడం నీ బాధ్యత.. అతని వృత్తి తను సవ్యంగా చేశాడు. మరి నీ బాధ్యతను నువు నిర్వర్తించాలి గా… నువ్వు నమ్మినపుడు విశ్వసించాలి కదా… అలా కాకుండా..”గాలిలో దీపం” పెట్టి, దేవుడా నువ్వు రక్షణగా ఉండు అంటే దేవుడు గాలిని ఆపేస్తాడా? నువు చేతులు అడ్డు పెట్టాలి కదా ..

– వనిత రెడ్డీ

Related Posts