గగనంలో

గగనంలో

గగనంలో

విశాల గగనంలో అందమైన అందరికన్నా పెద్ద నక్షత్రాన్ని నేనుఅందరికన్నా అందంగా ఉండడం వల్లనేమో నాకు కాస్త అహంకారం ఎక్కువే…
చిన్న చిన్న నక్షత్రాలన్నీ నా చుట్టూ చేరి కబుర్లు చెప్తూ ఉంటే నేనొక మహారాణి అనుకుంటాను.

కొన్నిటిని నేను పట్టించుకోను కూడా… అవి నాతో స్నేహం చేయాలని ఎంతో ఉవ్విల్లూరుతూ వస్తాయి… కానీ నేను వాటిని కన్నెత్తి కూడా చూడను, దగ్గరికి కూడా రానివ్వను.

అవి దగ్గరికి వస్తుంటే నేను దూరంగా పారిపోతూ ఉంటాను. నాతో చెలిమి చెయ్యాలని వాటికి ఎంతో ఉబలాటం.
నా అహంకారం వల్ల వాటిని నేను పట్టించుకోను. నక్షత్రాలన్నీ నా చుట్టూ ఉన్నప్పుడు వాటిని నా చెలికత్తెలుగా భావిస్తాను.

వాటికి నేను పనులు పురమాయిస్తాను. అందమైన చందమామ పక్కన ఉన్నందుకేమో నాకంత పొగరు, అహంకారం.
ఆ అహంకారంతో నేను వాటిని పట్టించుకోవడం మానేశాను.

కొన్ని రోజుల తర్వాత అందమైన రేడు నాకు దూరం అవ్వసాగాడు. ఆ దూరాన్ని నేను భరించలేక దగ్గరికి వెళ్తున్నప్పుడు తను నన్ను దూరం పెడుతూ వచ్చాడు. అలా అలా దూరం పెరిగిపోతూ నాకు చాలా దూరంగా వెళ్ళిపోయాడు.

మిగిలిన నక్షత్రాలు అన్నీ కూడా రేరాజు వెంట మరలిపోయాయి. ఇప్పుడు నేను ఏకాకి నక్షత్రాన్ని. నా చుట్టూ నక్షత్రాలు లేవు. నాతో కబుర్లు చెప్పేవారూ లేరు. నా స్నేహం కోసం అర్రులు చాచేవారూ లేరు. అప్పుడు అర్థం అయింది నాకు ఆ చిన్ని నక్షత్రాల బాధేంటో….

ఇప్పుడు నేను వాటి దగ్గరికి వెళ్ళలనుకున్నా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే నామోషీ అడ్డుగా వస్తుంది. అందమైన నక్షత్రాల తోటలో ఒంటరి తారను నేను…..

 

-భవ్యచారు

 

మీరెళ్తున్న దారులు Previous post మీరెళ్తున్న దారులు
నక్షత్రాల తోట Next post నక్షత్రాల తోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close